BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 06 June 2026, 03:32 pm
Posted by : NTODAY NEWS

గాలివారిగూడెంలో ఘనంగా ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక గ్రామ సభ

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
06 Jun, 2026 - 03:32 PM
108 వీక్షణలు

సమస్యల పరిష్కారం, గ్రామాభివృద్ధే ధ్యేయం

- సర్పంచ్ నారెడ్డి కవిత సుదర్శన్ రెడ్డి 

మరిపెడ మండలం గాలివారిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో శనివారం ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామ సభను ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ నారెడ్డి కవిత సుదర్శన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి గ్రామస్తులు, వివిధశాఖలఅధికారులు,ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా సర్పంచ్ నారెడ్డి కవిత సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గ్రామ ప్రజల సహకారంతో గాలివారిగూడెంను అన్ని రంగాల్లో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.గ్రామ సభలో పాల్గొన్న వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి మాట్లాడుతూ.. వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా,టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు తాగునీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.ఐసీడీఎస్ సూపర్వైజర్ ఉష మాట్లాడుతూ గర్భిణులు,బాలింతలు, చిన్నారులు పోషకాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. రక్తహీనత,పోషకాహార లోపాలను నివారించేందుకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ సందర్భంగా గ్రామంలో కొనసాగుతున్న మౌలిక వసతుల కల్పన,అభివృద్ధి పనుల పురోగతిని ఏఈ ప్రజలకు వివరించారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి,అంగన్‌వాడీ సిబ్బంది,ఆశా కార్యకర్తలు,గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.