BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 26 February 2026, 08:11 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

అంతర్రాష్ట్ర ట్రాన్స్‌ఫార్మర్ దొంగల ముఠా అరెస్ట్

తెలంగాణ
26 Feb, 2026 - 08:11 PM
365 వీక్షణలు
కామారెడ్డి జిల్లాలో అంతర్రాష్ట్ర ట్రాన్స్‌ఫార్మర్ దొంగల ముఠా అరెస్ట్ NTODAY NEWS: కామారెడ్డి 50కి పైగా చోరీల గుట్టురట్టు కామారెడ్డి, ఫిబ్రవరి 26: వ్యవసాయ భూముల్లోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి కాపర్ కాయిల్స్, ఆయిల్ దొంగిలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను కామారెడ్డి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది కాలంగా జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈ ముఠా వరుస చోరీలకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించిన మద్నూర్ పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు. కేసు వివరాలు బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, ఫిబ్రవరి 8, 2026న పెద్దఎక్లార గ్రామ సమీపంలోని పొలాల్లో ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేసి కాపర్ కాయిల్స్ దొంగిలించిన ఘటనపై గ్రామ పంచాయతీ అధికారి మన్నే సంతోష్ మద్నూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో ఈ ముఠా కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. ముఠా నేపథ్యం ముఠాలో కామారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు, మహారాష్ట్రకు చెందిన నలుగురు సభ్యులు ఉన్నారు. గతంలో నిజామాబాద్ జైలులో ఉన్న సమయంలో పరిచయం ఏర్పడి, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ముఠాగా ఏర్పడ్డారు. నేరాల తీరు మద్నూర్, జుక్కల్, పెద్దకొడప్గల్, పిట్లం, బిచ్కుంద పోలీస్ స్టేషన్ల పరిధిలోని వ్యవసాయ భూములే ప్రధాన లక్ష్యం. ఇప్పటి వరకు సుమారు 50కి పైగా ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి కాపర్ కాయిల్స్, ఆయిల్ దొంగిలించినట్లు నిందితులు అంగీకరించారు. పగటిపూట రేకీ నిర్వహించి సమాచారం సేకరించి, రాత్రివేళ మారణాయుధాలతో దాడులకు పాల్పడేవారని పోలీసులు తెలిపారు. పోలీసుల హెచ్చరిక నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మిగిలిన సభ్యుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. #Kamareddy #TransformerTheft #InterstateGang #TelanganaPolice #CrimeNews Follow us on Website Facebook Instagram YouTube