BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 18 March 2026, 12:54 pm
Posted by : కూనురు మధు

గోడ నిర్మాణ పనుల్లో ప్రమాదం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
18 Mar, 2026 - 12:54 PM
311 వీక్షణలు

చికిత్స పొందుతూ పశ్చిమ బెంగాల్ కూలీ మృతి

నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలోని వెలిమినేడు గ్రామ శివారులో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణ పనులు చేస్తూ ప్రమాదవశాత్తు కింద పడి ఓ కూలీ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం​పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, దక్షిణ దినాజ్‌పూర్ జిల్లా, రామచంద్రపూర్ గ్రామానికి చెందిన నారాయణ చంద్ర రాయ్ (43) గత రెండు నెలలుగా వెలిమినేడు శివారులోని శ్రీ లక్ష్మి కన్స్ట్రక్షన్ కంపెనీలో గోడ నిర్మాణ పనులు చేస్తున్నాడు అని.​ఈ నెల 13వ తేదీన తోటి కూలీలతో కలిసి సుమారు 12 అడుగుల ఎత్తులో తడకలపై నిలబడి పని చేస్తుండగా, ఒక్కసారిగా ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. ఈ క్రమంలో కింద ఉన్న ఐరన్ రాడ్ అతని తలకు బలంగా గుచ్చుకోవడంతో తీవ్ర రక్తస్రావమైంది అని తెలిపారు ​తీవ్రంగా గాయపడిన నారాయణ చంద్ర రాయ్‌ను వెంటనే నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆయన, పరిస్థితి విషమించడంతో  మార్చి 17చికిత్స పొందుతూ మరణించాడు అని తెలిపారు ఈ ఘటనపై​మృతుని బావ నితిన్ సర్కార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోస్టుమార్టం నిర్వహించి, దర్యాప్తు చేపట్టినట్లు  చిట్యాల ఎస్సై మామిడి రవి తెలిపారు.