BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 20 April 2026, 05:05 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గోదావరి ఒడ్డున పేలుడు పరికరాలు… బర్రెలకు తీవ్ర గాయాలు

తెలంగాణ
/ మంచిర్యాల
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Apr, 2026 - 05:05 PM
157 వీక్షణలు

గోదావరి ఒడ్డున పేలుడు పరికరాలు… బర్రెలకు తీవ్ర గాయాలు

మంచిర్యాల జిల్లా జన్నారం:

మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని బాదంపల్లి గ్రామ సమీపంలో గోదావరి నది ఒడ్డున ఆదివారం ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. వన్యప్రాణులను వేటాడేందుకు గుర్తుతెలియని వేటగాళ్లు గోదావరి ఒడ్డున పేలుడు పరికరాలు అమర్చినట్లు సమాచారం.

గ్రామానికి చెందిన పశువుల కాపరులు తమ బర్రెలను మేత కోసం గోదావరి తీర ప్రాంతానికి తీసుకువెళ్లారు. అయితే, అక్కడ మేత కోసం తిరుగుతున్న బర్రెలలో కొన్ని పేలుడు పరికరాలను తినడం వలన ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో పలు బర్రెలకు తీవ్ర గాయాలు కాగా, కాపరులు అత్యంత ఆందోళనకు గురయ్యారు. గాయపడిన పశువులను సమీపంలోని వెటర్నరీ వైద్యుల వద్ద చికిత్సకు తరలించారు.

ఈ ఘటనతో గ్రామస్థుల్లో తీవ్ర భయం నెలకొంది. వన్యప్రాణుల కోసం ఇలాంటి ప్రమాదకరమైన పేలుడు పరికరాలు అమర్చడం వల్ల నిరపరాధ పశువులు అస్తవాన్ని గమనిస్తూ, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అటవీ శాఖ, పోలీసు అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఇక, ఇదే ప్రాంతంలో మూడు రోజుల క్రితం కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. పేలుడు పరికరాలను తినడం వల్ల నాలుగు మేకలు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ రెండు ఘటనలు గ్రామ ప్రజల మధ్య మరింత భయాందోళనలు కలిగించాయి.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు జన్నారం ఎస్ఐ ఉదయ్ కిరణ్ తెలిపారు. బాధ్యుల్ని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.