BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 06 June 2026, 01:45 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలు, విజ్ఞాన భాండాగారాలు: మోరంపూడి శ్రీనివాసరావు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Jun, 2026 - 01:45 PM
274 వీక్షణలు

నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు శనివారం ఉదయం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలోని చనుబండ శాఖా గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం ముగింపు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.

క్రమార్ధంగా, అతిథులు, గ్రంథాలయాధికారి కేకు కట్ చేసి పిల్లలకు పంచారు. శిబిరంలో పాల్గొన్న విద్యార్థులకు బిస్కట్లు అందజేయడం జరిగింది. ఈ వేసవి విజ్ఞాన శిబిరంలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి బహుమతి మరియు ప్రశంసా పత్రాలను అతిథుల చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, "నాలెడ్జే పవర్" అని, పుస్తక పఠనం ద్వారా జ్ఞానం పెరుగుతుందని, దానికి గ్రంథాలయాలను వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు.

అతిథులు కందుల కృష్ణ, చీదిరాల మారేశ్వర రావు, నక్కా రాము, బజ్జూరి గోపి కూడా గ్రంథాలయాల ఉపయోగాలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారి శ్రీకాంత్, సిబ్బంది త్రివేణి, షేక్ రియాజ్, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.