BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 21 July 2026, 07:46 pm
Posted by : V శ్రీనివాస్

​జంతర్‌మంతర్‌ బాధితులను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

జాతీయం జాతీయం
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
21 Jul, 2026 - 07:46 PM
146 వీక్షణలు

​జంతర్‌మంతర్‌ బాధితులను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

​నిరసనకారులపై పోలీసుల లాఠీచార్జి, దురుసు ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం

​ఢిల్లీ ఆర్‌ఎంఎల్‌ ఆసుపత్రిలో క్షతగాత్రులకు పరామర్శ

​బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో ఆరా

జంతర్‌మంతర్‌ వద్ద నిర్వహించిన పార్లమెంట్‌ ముట్టడి కార్యక్రమంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆందోళనకారులపై, ముఖ్యంగా మహిళలు, పిల్లలు అని కూడా చూడకుండా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. అమానుషంగా లాఠీచార్జ్‌ చేయడంతో పాటు గ్యాస్‌ బాంబులు ప్రయోగించారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పోలీసుల దాడిలో పలువురు తీవ్రంగా గాయపడగా, బాధితులను ఢిల్లీలోని రామ్‌ మనోహర్‌ లోహియా (ఆర్‌ఎంఎల్‌) ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

​ఈ నేపథ్యంలో, ఘటనపై సమాచారం అందుకున్న పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యులు గడ్డం వంశీకృష్ణ మంగళవారం ఆర్‌ఎంఎల్‌ ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న వైద్య సేవలను ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం బాధితులతో ఆయన నేరుగా మాట్లాడి, ఆందోళన సమయంలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ భరోసా కల్పించారు