BREAKING
thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి
Date of Publish : 29 July 2026, 02:52 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గుండు చేయించుకుంటే డబ్బులు అంటూ మోసం! ముగ్గురు మహిళలను బురిడీ కొట్టించిన ఆకతాయిలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Jul, 2026 - 02:52 PM
83 వీక్షణలు

సేలం జిల్లాలో విచిత్ర ఘటన.. ఫోన్ కాల్ నమ్మి గుండు చేయించుకున్న బాధితులు

తమిళనాడులోని సేలం జిల్లా పుదుకొత్తంబాడి ప్రాంతంలో అమాయక మహిళలను లక్ష్యంగా చేసుకుని కొందరు ఆకతాయిలు విచిత్రమైన మోసానికి పాల్పడ్డారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని చెప్పిన ఓ అజ్ఞాత వ్యక్తి, త్వరలో కరోనా తరహా కొత్త వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని మహిళలను భయపెట్టాడు.

విదేశాల్లో ఆ వ్యాధి సోకిన వారంతా గుండు గీయించుకున్నారని, తమిళనాడు ప్రభుత్వం కూడా అదే విధానాన్ని అమలు చేస్తోందని నమ్మించాడు. ప్రభుత్వం ప్రత్యేక పథకం కింద గుండు చేయించుకున్న మహిళలకు రూ.15 వేల ఆర్థిక సాయం, కళాశాల విద్యార్థినులకు రూ.45 వేలతో పాటు ఉచిత ల్యాప్‌టాప్, పురుషులకు రూ.6 వేల నగదు అందిస్తామని చెప్పాడు. ఇప్పటికే జాబితాలో మీ పేరు ఉందంటూ ఓ మహిళను నమ్మించాడు.

ఆ మహిళ ఈ విషయాన్ని గ్రామంలోని ఇతర మహిళలకు చెప్పడంతో ముగ్గురు మహిళలు నిజమేనని భావించి గుండు చేయించుకున్నారు. అనంతరం చెప్పిన నంబర్‌కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో తాము మోసపోయినట్లు గ్రహించారు. దీంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ను గుడ్డిగా నమ్మవద్దని, ప్రభుత్వ పథకాలపై సందేహాలు ఉంటే సంబంధిత అధికారులను నేరుగా సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.