BREAKING
​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
Date of Publish : 08 June 2026, 03:30 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
08 Jun, 2026 - 03:30 PM
97 వీక్షణలు

గుంటూరు కలెక్టరేట్‌లో యువతి ఆత్మహత్యాయత్నం

గుంటూరు కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. 'నాని' అనే యువతి తన కుటుంబ సభ్యుల వేధింపులను తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

బాధిత యువతి ఆరోపణల ప్రకారం, తన తండ్రి, బాబాయ్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యులు తనను, తన తల్లిని వేధిస్తున్నారని తెలిపింది. తన తండ్రికి రెండో వివాహం జరిపించి, తన తల్లి వద్ద నుంచి 15 సవర్ల బంగారం, రూ.5 లక్షల నగదును తీసుకుని ఇంటి నుంచి బయటకు పంపించారని ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ విషయంపై పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సరైన న్యాయం జరగలేదని, సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో కలెక్టరేట్‌లోనే తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఘటనను గమనించిన అధికారులు, పోలీసులు వెంటనే స్పందించి యువతిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

ఈ ఘటనపై నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి చేసిన ఆరోపణలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.