BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 16 March 2026, 02:44 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గవర్నర్ ప్రసంగంలో హామీల ప్రస్తావనే లేదు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Mar, 2026 - 02:44 PM
121 వీక్షణలు

హైదరాబాద్, మార్చి 16: తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగంలో ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ఎలాంటి ప్రస్తావన లేదని అన్నారు. రైతుల ఇబ్బందులు, ఉద్యోగాల భర్తీ, ఉద్యోగుల సమస్యలపై ఒక్క మాట కూడా లేదని ఆయన పేర్కొన్నారు.

విశ్రాంత ఉద్యోగులు ఎన్నేళ్లు గడిచినా తమకు రావాల్సిన ప్రయోజనాలు అందడం లేదని గోసపడుతున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన చట్టాలు ఉన్నప్పటికీ వారికి అందాల్సిన సౌకర్యాలు సరైన విధంగా అందడం లేదని విమర్శించారు.

బీసీలను పూర్తిగా మోసం చేస్తున్నారని, సబ్ ప్లాన్ అమలుపై ఎలాంటి స్పష్టత లేదని పాయల్ శంకర్ అన్నారు. ప్రభుత్వ అప్పుల విషయంలో కూడా ప్రజలకు సరైన సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. గవర్నర్‌తో ప్రభుత్వం మాట్లాడించేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని, అవాస్తవాలు మరియు గందరగోళమైన విషయాలు చెప్పించారని విమర్శించారు.

ప్రభుత్వం విస్మరించినంత మాత్రాన బీజేపీ మౌనంగా ఉండదని, తెలంగాణ ప్రజల గొంతుకగా నిలబడి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని ఆయన స్పష్టం చేశారు.

అసెంబ్లీలో తెలంగాణ గేయం అనంతరం వందేమాతరం గేయాన్ని ఆలపించే సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు బయటకు వెళ్లడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది రాజ్యాంగం, దేశాన్ని అవమానించినట్టేనని మండిపడ్డారు. వందేమాతరం వినడానికి ఆసక్తి లేకపోవడమా? లేక దేశభక్తి లేకపోవడమా? అని ప్రశ్నించారు. వందేమాతరం గేయాన్ని అవమానపరిచిన ఎంఐఎం ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు.