BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 06 June 2026, 03:27 pm
Posted by : V శ్రీనివాస్

​ఘనంగా ముగిసిన ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
06 Jun, 2026 - 03:27 PM
296 వీక్షణలు

41 రోజుల పాటు ప్రజల దాహార్తిని తీర్చిన కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్

మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

​మంచిర్యాల నియోజకవర్గంలో వేసవి కాలాన్ని పురస్కరించుకుని కీ.శే. శ్రీ కొక్కిరాల రఘుపతి రావు గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత అంబలి పంపిణీ కేంద్రాల ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖల ఆధ్వర్యంలో... మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంచిర్యాల బస్టాండ్, మార్కెట్, ఐబీ చౌరస్తా, హమాలీవాడ, సిసిసి కార్నర్, శ్రీరాంపూర్ కాలనీలతో పాటు లక్షెట్టిపేట టౌన్‌లోని ఉత్కూర్ చౌరస్తా వంటి ప్రధాన కూడళ్లలో ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఈ కేంద్రాలను విజయవంతంగా నిర్వహించారు.

​ఈ ముగింపు సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్ గారలు మాట్లాడుతూ... మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లో 41 రోజులు, లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో 37 రోజుల పాటు నిరంతరాయంగా అంబలి పంపిణీ చేసి ప్రజలకు అండగా నిలిచామని, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజా సేవకు ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర పిసిసి ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ గారితో పాటు పలువురు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో, సేవా కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు