BREAKING
పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?...
Date of Publish : 12 June 2025, 07:56 am
Posted by : NTODAY NEWS OFFICIAL

మరొకసారి మానవత్వం చాటుకున్న గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు

తెలంగాణ
12 Jun, 2025 - 07:56 AM
278 వీక్షణలు
మరొకసారి మానవత్వం చాటుకున్న గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు  నియోజకవర్గ ప్రజలను ఆపదలో ఆదుకునే వ్యక్తిగా మరొకసారి నిలిచారు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు. ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న ఓ చిన్నారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 10 లక్షలు ఆర్థిక సహాయం అందించి, ఆ కుటుంబానికి అండగా ఉంటానని MLA మద్దిపాటి వెంకటరాజు  ధైర్యం చెప్పారు. గోపాలపురం నియోజకవర్గo , ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం సాయం పాలెం గ్రామానికి చెందిన హరిబాబు రాజేశ్వరి అనే భార్యాభర్తలు ఆరేళ్ల పాప, నాలుగేళ్ల బాబు సంతానం. ఇటీవల ఇద్దరు పిల్లలు అనారోగ్యం పాలై పాప వారం రోజుల క్రితం చనిపోయింది. అయితే బాబుని అత్యవసర చికిత్స నిమిత్తం హైదరాబాదు ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యానికి సుమారు 20 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలిపారు. బాబు పరిస్థితి తెలుసుకున్న గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు  చలించిపోయారు. వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పది లక్షలకు ఎల్ఓసి ఇప్పించి హైదరాబాద్ ఆస్పత్రిలోని డాక్టర్లతో మాట్లాడి వెంటనే వైద్య సేవలు అందేటట్లు చేసి ఆ బాబుకు అండగా తానున్నానంటూ ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య ఎదురైనా సరే ఆయన ముందు ఉంటారని మరోసారి రుజువు చేశారు. కూటమి ప్రభుత్వంలో నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన చేస్తున్న సేవల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. Follow us on Website Facebook Instagram YouTube