BREAKING
thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
Date of Publish : 31 May 2026, 07:43 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

హార్స్లీ హిల్స్‌లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
31 May, 2026 - 07:43 PM
134 వీక్షణలు
ప్రత్యేక తనిఖీల్లో భారీగా జరిమానాలు – వాహనాల సీజ్
ప్రజల ప్రాణ భద్రతతో చెలగాటం ఆడితే ఉపేక్షించం

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ హెచ్చరిక

మదనపల్లె,  ప్రముఖ పర్యాటక కేంద్రం హార్స్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారిపై జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు.
హార్స్లీ హిల్స్ ఘాట్ రోడ్డులో కొందరు యువకులు అతివేగంగా, నిర్లక్ష్యంగా ద్విచక్ర వాహనాలు నడపడం, ఒకే బైక్‌పై ముగ్గురు, నలుగురు ప్రయాణించడం, మోడిఫైడ్ సైలెన్సర్లతో శబ్ద కాలుష్యం సృష్టించడం, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వంటి చర్యలతో తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెడుతున్నారని కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ఆదివారం ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించగా, కేవలం రెండు గంటల వ్యవధిలోనే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై కేసులు నమోదు చేసి రూ.52 వేల జరిమానాలు వసూలు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే 13 వాహనాలపై కేసులు నమోదు చేయడంతో పాటు పలువాహనాలను సీజ్ చేసినట్లు వెల్లడించారు.
హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్, మోడిఫైడ్ సైలెన్సర్ల వినియోగం, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్, ఆర్సీ, ఇన్సూరెన్స్ వంటి చట్టబద్ధ పత్రాలు లేకుండా వాహనాలు నడపడం, ప్రమాదకరంగా డ్రైవింగ్ చేయడం వంటి ఉల్లంఘనలపై ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.
హార్స్లీ హిల్స్‌లో పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇకపై నిరంతరాయంగా ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహిస్తామని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు మరింత కఠినంగా ఉంటాయని హెచ్చరించారు.
పర్యాటకులు, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, తమ భద్రతతో పాటు ఇతరుల భద్రతను కూడా దృష్టిలో ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సూచించారు.
"నిబంధనలు పాటించడం బాధ్యత... ఉల్లంఘించడం ప్రమాదం. హార్స్లీ హిల్స్‌లో నిర్లక్ష్య డ్రైవింగ్‌ను ఏమాత్రం సహించం" అని కలెక్టర్ స్పష్టం చేశారు.