BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 19 March 2026, 08:39 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

హైదరాబాద్‌లో విషాద ఘటన

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Mar, 2026 - 08:39 PM
239 వీక్షణలు

హైదరాబాద్‌లో విషాద ఘటన – పెంపుడు పిల్లి మృతి తట్టుకోలేక యువతి ఆత్మహత్య

హైదరాబాద్ నగరంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పెంపుడు జంతువుపై అధిక అనుబంధం, భావోద్వేగ బలహీనత కలిసి ఓ యువతి ప్రాణాన్ని బలి తీసుకున్న సంఘటన కలకలం రేపుతోంది.

మీరపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడంగ్‌పేట్ ప్రాంతానికి చెందిన హిమబిందు (20) బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతోంది. గత రెండు సంవత్సరాలుగా ఆమె ఒక పెంపుడు పిల్లిని ఎంతో ప్రేమగా పెంచుకుంటూ వచ్చేది. ఆ పిల్లి ఆమెకు అత్యంత సన్నిహితంగా మారి, కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ అనుబంధం ఏర్పడింది.

అయితే ఇటీవల ఆ పెంపుడు పిల్లి మృతి చెందడంతో హిమబిందు తీవ్ర మనోవేదనకు గురైంది. ఆ బాధను తట్టుకోలేక ఇంట్లో ఉన్న ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

“పిల్లిని ఇంటికి తీసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. చివరకు పిల్లి చనిపోవడంతో మా కుమార్తె కూడా మమ్మల్ని వదిలి వెళ్లిపోయింది” అంటూ తల్లిదండ్రులు విలపించడం స్థానికులను కంటతడి పెట్టించింది.

ఈ ఘటనతో సమాజంలో పెరుగుతున్న ఒంటరితనం, భావోద్వేగ అస్థిరతపై మరోసారి చర్చ మొదలైంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పెంపుడు జంతువులపై ప్రేమ సహజమే అయినప్పటికీ, అది మానసికంగా అతిగా ఆధారపడే స్థాయికి చేరితే ప్రమాదకర పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు పరస్పరం అర్థం చేసుకుని భావోద్వేగ మద్దతు అందించడం ఎంతో అవసరమని సూచిస్తున్నారు.