BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 10 April 2026, 07:30 pm
Posted by : ఇప్పలపల్లి నరేందర్

డా. సి.ఎఫ్. శామ్యూల్ హానిమన్ 271వ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ ప్రాంగణంలో యోగ డే

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / భువనగిరి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
10 Apr, 2026 - 07:30 PM
166 వీక్షణలు

హోమియోపతి వైద్యశాస్త్ర పితామహుడు డా. సి.ఎఫ్. శామ్యూల్ హానిమన్ 271వ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ ప్రాంగణంలో యోగ డే 

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహిస్తున్న హెల్త్ వీక్ డే–5 లో కార్యక్రమాలలో భాగంగా ఈరోజు ఆయుష్ & హోమియోపతి దినం హోమియోపతి దినోత్సవం సందర్భంగా హోమియోపతి వైద్యశాస్త్ర పితామహుడు డా. సి.ఎఫ్. శామ్యూల్ హానిమన్ గారి 271వ జయంతిని పురస్కరించుకొని, జిల్లా స్థాయిలో డా.ఎం. మనోహర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అధ్యక్షతన,  కలెక్టరేట్ ప్రాంగణం నందు ఉదయం 6:30 నుండి 7:30 వరకు కు యోగ డే నిర్వహించడం  జరిగింది ఈ కార్యక్రమంలో 70 మంది అధికారులకి మరియు సిబ్బంది కి రామకృష్ణ, ఝాన్సీ మరియు సరిత యోగ లు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. మనోహర్  మాట్లాడుతూ, యోగా అనేది శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యానికి మేలు చేసే పురాతన భారతీయ సాధన. ఇది శరీరాన్ని, మనస్సును ఏకం చేసి, ఒత్తిడిని తగ్గించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. నిత్య యోగాభ్యాసం వల్ల ఏకాగ్రత, రోగనిరోధక శక్తి పెరిగి, రక్తపోటు నియంత్రణలో ఉండి, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది తెలియ చేసారు. ప్రతి ఒక్కరూ యోగా సాధనను అలవాటు చేసుకొని ఆరోగ్యంగా జీవించవచ్చని సూచించారు.తదనంతరం, జిల్లా స్థాయి లో హోమియోపతి, ఆయుర్వేద మరియు యునాని మూడు విధాల వైద్య విధానాలతో కూడిన మెగా ఆయుష్ వైద్య శిబిరం జిల్లా స్థాయిలో డా. J.R. సంగీత (CMO), డా. K. బాల భవాని (SMO), డా. K. సద్గుణ (M.O, క్యాంప్ ఇంచార్జ్), డా. V. విజయ లక్ష్మి (M.O, డిస్ట్రిక్ట్ ఇంచార్జ్), డా. Ch. శ్రీనివాస్ (M.O, GHD, చౌటుప్పల్), డా. P. కవిత (M.O, GAD, రాయగిరి), డా. రోజ్ మేరీ (M.O, GUD, చౌటుప్పల్) తో నిర్వహించడం జరిగింది. ఈ శిబిరాన్ని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. మనోహర్  జ్యోతి ప్రజ్వలన చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. మనోహర్ మాట్లాడుతూ, హోమియోపతి, ఆయుర్వేద మరియు యునాని వైద్య విధానాలు సహజసిద్ధమైన చికిత్సలను అందిస్తూ, వ్యాధి నివారణతో పాటు సంపూర్ణ ఆరోగ్యం (Holistic Health) సాధనలో కీలక పాత్ర పోషిస్తాయి. ఆయుర్వేదం మూలికలు, ఆహార నియమాలు, యోగా మరియు జీవనశైలి మార్పుల ద్వారా వాత–పిత్త–కఫ సమతుల్యతను కాపాడి వ్యాధులను మూలాల నుండి తగ్గిస్తుంది. హోమియోపతి “సమానమైనది సమానమైనదాన్ని నయం చేస్తుంది” అనే సూత్రంపై సూక్ష్మ మోతాదుల మందులతో, దుష్ప్రభావాలు లేకుండా చికిత్స అందిస్తుంది. యునాని వైద్య విధానం శరీరంలోని రక్తం, కఫం, పసుపు పిత్తం, నల్ల పిత్తం అనే నాలుగు రసాల (Humors) సమతుల్యతను పునరుద్ధరించడంపై దృష్టి సారిస్తుంది. ఈ మూడు విధానాలు సహజ వనరులైన మూలికలు, ఖనిజాల ఆధారంగా మందులు తయారు చేయడం, రోగి శరీర తత్వం (Prakriti) ఆధారంగా వ్యక్తిగత వైద్యం అందించడం, ఆర్థరైటిస్, చర్మ వ్యాధులు, ఆస్తమా వంటి దీర్ఘకాలిక సమస్యల నిర్వహణలో ఉపయోగకరంగా ఉండడం, అలాగే రోగనిరోధక శక్తిని పెంపొందించడం వంటి ముఖ్యమైన ప్రయోజనాలను కలుగుతాయి అన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో హోమియోపతి:82 ఆయుర్వేద:40 మరియు యునాని :60 మొత్తం : 182 మంది రోగులు ఈ క్యాంపు ద్వారా చికిత్స పొందారు.ఈ కార్యక్రమంలో డా. పాండు నాయక్  సూపరింటెండెంట్, డా. J.R. సంగీత  (CMO), డా. K. బాల భవాని (SMO), డా. K. సద్గుణ  (M.O, క్యాంప్ ఇంచార్జ్), డా. V. విజయ లక్ష్మి  (M.O, డిస్ట్రిక్ట్ ఇంచార్జ్), డా. Ch. శ్రీనివాస్ (M.O, GHD, చౌటుప్పల్), డా. P. కవిత (M.O, GAD, రాయగిరి), డా. రోజ్ మేరీ (M.O, GUD, చౌటుప్పల్), మరియు ఆయుష్ సిబ్బంది పాల్గొన్నారు.