BREAKING
thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం
Date of Publish : 04 June 2026, 06:27 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

హరీష్‌రావుపై కేటీఆర్‌కు భయమా..? బీఆర్‌ఎస్‌లో నాయకత్వ పోరు మొదలైందన్న అద్దంకి దయాకర్

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jun, 2026 - 06:27 AM
138 వీక్షణలు

హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్‌రావు రాజకీయంగా బలమైన నాయకుడిగా ఎదుగుతున్న నేపథ్యంలో, ఆయనతో ప్రమాదం ఉందనే భావనతో కేటీఆర్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ విమర్శించారు. సీఎల్పీ మీడియా హాల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన బీఆర్‌ఎస్ అంతర్గత పరిస్థితులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

బీఆర్‌ఎస్‌లో నాయకత్వ సంక్షోభం నెలకొందని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడి హోదాకు రాజీనామా చేయాలని అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. పదవుల కోసం త్యాగాలు చేశానని చెప్పే కేసీఆర్, ఇప్పుడు బాధ్యత కూడా తీసుకోవాలని సూచించారు.

ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపై వస్తున్న విమర్శలను ఖండించిన ఆయన, భవిష్యత్తు లేని నాయకులకే ఫ్యూచర్ సిటీపై భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం టాప్-100 కంపెనీలను తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంపై కేటీఆర్‌కు పూర్తి అవగాహన లేదని, అవసరమైతే ప్రత్యేకంగా క్లాస్ చెబుతామని అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. అలాగే బీజేపీ నాయకత్వంపై సొంత పార్టీ నేతలకే నమ్మకం లేదని, ప్రజలు మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని విశ్వసిస్తున్నారని అన్నారు.

ప్రతిపక్షాలు రెచ్చగొట్టే రాజకీయాలకు దూరంగా ఉండాలని, అలాంటి రాజకీయాలతో లబ్ధి పొందాలని ప్రయత్నించవద్దని అద్దంకి దయాకర్ హెచ్చరించారు.