BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం

తెలంగాణ
/ కరీంనగర్ / కరీంనగర్ రూరల్
Reporter
రాజేష్ తాళ్లపెల్లి హుజురాబాద్ నియోజకవర్గ ప్రతినిధి
14 Apr, 2026 - 01:21 PM
137 వీక్షణలు

హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం 

ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు

సన్మానించిన ఏసీపి మాధవి

ఇంటర్మీడియట్ పరీక్షలలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. హుజురాబాద్ పట్టణములోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో అధిక ఉత్తీర్ణత మార్కులు2 సాధించారు. ఈ సందర్భంగా సోమవారం రోజున అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు కళాశాలలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హుజురాబాద్ ఏసిపి మాధవి హాజరై విద్యార్థులు అయిన బి.శ్రావణి ఎంపీసీ సెకండ్ ఇయర్ 973/1000, మేరీ ఏంజెల్ ఎంపీసీ ఫస్టియర్ 457/470, జానకిరామ్ బైపిసి సెకండియర్ 867/1000, అను శ్రీ సీఈసీ సెకండియర్ 842/1000, అఖిల హెచ్ఈసి సెకండియర్ 644/1000, ఈ.కావేరి సిటీ సెకండియర్ ఒకేషనల్ 897/100, టీ.చరణ్ కుమార్ ఇటీ సెకండియర్ 855/1000, శ్రీకాంత్ రెడ్డి ఈ&సీటి సెకండియర్ 746/1000, సాదియా కౌసర్ బైపీసీ ఫస్ట్ ఇయర్ 382/440, సౌమ్య సిఇసి ఫస్టియర్ 420/500, సాయి తేజ ఈఎన్సిటి ఫస్ట్ ఇయర్ 453/500, సాయి చరణ్ ఈటి ఫస్ట్ ఇయర్ 401/500, సాత్విక్ సిటీ ఫస్ట్ ఇయర్ 399/500 ఈ విద్యార్థులను మరియు తల్లిదండ్రులను శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం ఇచ్చి పెన్నులు బహుకరించారు. ఈ సందర్భంగా ఏసిపి మాధవి మాట్లాడుతూ...టాపర్స్ లలో ఎక్కువగా బాలికలు ఉండడం చాలా సంతోషకరమని, భవిష్యత్తులో మరింత కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని తెలిపారు. విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని వాటిని సాధించడానికి ప్రయత్నించాలన్నారు. రాబోయే పోటీ పరీక్షలలో NEET,IIT,EAPCET ల యందు పట్టుదలతో ప్రయత్నించి మంచి ఫలితాలు తెచ్చి కళాశాలకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ వి ఆంజనేయరావు మాట్లాడుతూ... ప్రభుత్వ కళాశాలలో చదువుతూ అధిక మార్కులు రావడం ఎంతో సంతోషకరమైనదని, ఇలాగే చదువుతూ ఉన్నత శిఖరాలను అందుకోవాలని, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. అనంతరం బాణాసంచా పేజీ కళాశాల ప్రాంగణంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పి.ప్రసాద్, బండి రాజశేఖర్, సురేష్, శైలజ, చరణ్, వెంకటరమణ, విజేందర్ రెడ్డి, మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.