BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 23 March 2026, 02:55 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

ఇల్లందకుంట రాముడికి రూ. 21 లక్షల వెండి ఆభరణాల కానుక.

తెలంగాణ
/ కరీంనగర్
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
23 Mar, 2026 - 02:55 PM
127 వీక్షణలు

ఇల్లందకుంట రాముడికి రూ. 21 లక్షల వెండి ఆభరణాల కానుక.. మరణించినా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న భక్తుడు

ఇల్లందకుంట: 'అపర అయోధ్య'గా పేరుగాంచిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి ఓ భక్తుడు తన చివరి శ్వాస వరకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని, స్వామివారిపై తనకున్న అపారమైన భక్తిని చాటుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన దివంగత డాక్టర్ కోరేం నర్సింహారెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు సోమవారం స్వామివారికి భారీ వెండి ఆభరణాలను సమర్పించారు.

​మాట ఇచ్చి.. ప్రాణం వదిలే వరకు ఆరాటపడి:

సుమారు మూడు సంవత్సరాల క్రితం డాక్టర్ నర్సింహారెడ్డి గారు ఇల్లందకుంట ఆలయాన్ని దర్శించినప్పుడు, అప్పటి ముఖ్య అర్చకులు శేషం రామాచార్యులు గారు స్వామివారికి ఏదైనా చేయించాలని కోరారు. దానికి స్పందించిన ఆయన, స్వామివారికి వెండి తొడుగులు చేయిస్తానని మాట ఇచ్చారు. అయితే, కొన్ని రోజుల క్రితం ఆయన ఆరోగ్యం క్షీణించింది. తన చివరి క్షణాల్లోనూ "నేను స్వామివారికి మాట ఇచ్చాను.. అది పూర్తి చేయాలి" అనే ఆరాటంతో తన భార్య, కుమారుల ద్వారా అర్చకులతో మాట్లాడించి ఆభరణాల తయారీకి ఆర్డర్ ఇప్పించారు. ఆ విషయం ఫోన్లో విన్న వెంటనే ఎంతో ఆనందపడిన ఆయన, అదే రోజు సాయంత్రం శివైక్యం చెందారు.

​రూ. 21 లక్షల విలువైన వెండి ఆభరణాలు:

నర్సింహారెడ్డి గారి సంకల్పం మేరకు ఆయన భార్య శ్రీదేవి, కుమారులు హరీష్ ప్రతాప్ రెడ్డి, హిరేన్ ప్రతాప్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు కలిసి సుమారు 8 కిలోల వెండితో తయారు చేయించిన ఆభరణాలను ఆలయానికి తీసుకొచ్చారు. వీటిలో:

​వెండి తొడుగులు

​సుందరమైన కిరీటాలు

​అభయ హస్తాలు ఉన్నాయి.

వీటి మొత్తం విలువ సుమారు రూ. 21 లక్షలు. రాబోయే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ ఆభరణాలను స్వామివారికి అలంకరించనున్నారు.

​ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈఓ (EO), చైర్మన్, అర్చకులు శేషం రామాచార్యులు మరియు ఆలయ సిబ్బంది పాల్గొని నర్సింహారెడ్డి గారి కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు.