BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 12 April 2026, 03:11 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

ఇంటర్ ఫలితాల్లో పైడిపెల్లి విద్యార్థిని ప్రభంజనం: రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన గాలి సౌమ్య శ్రీ

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
12 Apr, 2026 - 03:11 PM
731 వీక్షణలు

ఇంటర్ ఫలితాల్లో పైడిపెల్లి విద్యార్థిని ప్రభంజనం: రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన గాలి సౌమ్య శ్రీ

ఇంటర్ ఫలితాల్లో పైడిపెల్లి ఆణిముత్యం: రాష్ట్ర స్థాయిలో సౌమ్య శ్రీ రికార్డు(వెల్గటూర్ )​పైడిపెల్లి 

నేడు విడుదలైన తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో పైడిపెల్లి గ్రామానికి చెందిన గాలి సౌమ్య శ్రీ యాదవ్ రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించి రికార్డు సృష్టించారు. రెజోనెన్స్ జూనియర్ కళాశాల (కోట) విద్యార్థిని అయిన సౌమ్య శ్రీ, ఎంపీసీ (MPC) విభాగంలో 470 మార్కులకు గాను 469 మార్కులు సాధించి ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.

​నిరుపేద కుటుంబంలో విరిసిన ఆణిముత్యం:

గ్రామానికి చెందిన గాలి సంతోష్ యాదవ్ - సునీత దంపతుల కుమార్తె అయిన సౌమ్య శ్రీ, నిరుపేద కుటుంబంలో జన్మించినప్పటికీ, చదువుపై ఉన్న మక్కువతో కష్టపడి చదివి ఈ విజయాన్ని అందుకున్నారు. ఆమె సాధించిన ఈ విజయం గ్రామానికే కాకుండా జిల్లాకే గర్వకారణంగా నిలిచింది.

​హర్షం వ్యక్తం చేస్తున్న ప్రముఖులు:

సౌమ్య శ్రీ రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించడం పట్ల గ్రామస్థులు, పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం పట్ల ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థిని తల్లిదండ్రులు తమ కుమార్తె సాధించిన విజయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, కళాశాల యాజమాన్యం మరియు అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలిపారు.