BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 18 February 2026, 07:22 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

తిరుమలనాథ స్వామి ఆలయంలో శంకు–చక్రాల ప్రతిష్ఠాపన

తెలంగాణ
18 Feb, 2026 - 07:22 PM
139 వీక్షణలు
పెద్దకాపర్తిలో తిరుమలనాథ స్వామి ఆలయంలో శంకు–చక్రాల ప్రతిష్ఠాపన NTODAY NEWS: చిట్యాల: నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలోని తిరుమలనాథ స్వామి దేవాలయంలో శంకు–చక్రాల ప్రతిష్ఠాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా పూజలు, హోమాలు నిర్వహించి ప్రతిష్ఠాపన చేపట్టారు. గ్రామంలోని భూదేవి సమేత తిరుమలనాథ స్వామి ఆలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శంకు–చక్రాలను సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం పద్మ యాదవ్ సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి శంకు–చక్రాలను ఆలయ గోపురంపై ప్రతిష్ఠించారు. హోమ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఓర్సు రాజకుమార్ దంపతులు పాల్గొని సేవలు అందించారు. ఈ సందర్భంగా ఉరుమడ్ల సర్పంచ్ సాగర్ల బిక్షం భాను శ్రీ, చిన్నకాపర్తి సర్పంచ్ ఆవుల సుందర్, పిట్టంపల్లి సర్పంచ్ అందే రాములు యాదమ్మ, తాళ్లవెల్లంల సర్పంచ్ జోగు సురేష్, ముద్దసాని నీత రమణారెడ్డి, ఉపసర్పంచ్ ఓర్సు సైదులు, డైరెక్టర్లు ఏర్పుల యాదమ్మ, నరసింహ, చలమల్ల మసూద్ రెడ్డి, జిల్లా నరసింహ, వార్డు సభ్యులు మరియు ఇతర నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమం భక్తి వాతావరణంలో సాఫీగా ముగిసింది. #Chityal #Nalgonda #TirumalanathaSwamy #TempleEvent #ShankuChakra Follow us on Website Facebook Instagram YouTube