BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 25 February 2026, 06:53 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

తెలంగాణ
25 Feb, 2026 - 06:53 AM
348 వీక్షణలు
జగిత్యాల జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ జగిత్యాల: జిల్లా వ్యాప్తంగా బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు మొదటి రోజు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. జిల్లాలోని మొత్తం 30 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు హాజరై పరీక్షలు రాశారు. జనరల్ కోర్సులకు 6,879 మంది, వొకేషనల్ కోర్సులకు 1,029 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 253 మంది గైర్హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ స్థానిక ఎస్‌కే‌ఎన్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి, పరీక్షా కేంద్రంలో కల్పించిన సౌకర్యాలు, హాజరు శాతం వంటి అంశాలను పరిశీలించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్. లత కోరుట్ల, మెట్‌పల్లిలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలను సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. ఎస్‌కే‌ఎన్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒక విద్యార్థి 10 నిమిషాలు ఆలస్యంగా రావడంతో నిబంధనల ప్రకారం పరీక్షకు అనుమతించలేదు. జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని, పరీక్షలు పారదర్శకంగా జరిగాయని జిల్లా పరీక్షల కన్వీనర్ బి. నారాయణ తెలిపారు. పరీక్షలు సజావుగా కొనసాగేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. #Jagtial #IntermediateExams #ExamUpdate #TelanganaNews #EducationNews Follow us on Website Facebook Instagram YouTube