BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 12 January 2026, 07:36 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ధర్మపురిలో అభివృద్ధి కనిపించడం లేదా?

తెలంగాణ
12 Jan, 2026 - 07:36 AM
193 వీక్షణలు

ధర్మపురిలో అభివృద్ధి కనిపించడం లేదా?

సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరిపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర విమర్శలు NTODAY NEWS: ధర్మపురి ధర్మపురిలో ఏం అభివృద్ధి జరిగిందని ప్రశ్నించిన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురిలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధర్మపురిలో జరిగిన అభివృద్ధి పనులు కనిపించకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. “నువ్వు మేము చేయని పని ఏంటో చెబితే బాగుంటుంది” అంటూ మంత్రి అడ్లూరిపై ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి పనులు: ధర్మపురిని మున్సిపాలిటీగా ఏర్పాటు సుమారు 10 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణం క్యాంపు కార్యాలయం, హైవే రోడ్డు నిర్మాణం 9 కోట్లతో 50 పడకల మాతా–శిశు ఆసుపత్రి నిర్మాణం పట్టణ ఆరోగ్య కేంద్రం విస్తరణ (30 నుంచి 50 పడకలు) డయాలసిస్ సెంటర్, ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు రెండు బస్తీ దవాఖానాలు, వెటర్నరీ ఆసుపత్రి నిర్మాణం 22 లక్షలతో అంబులెన్స్ అందజేత పోలీస్ స్టేషన్ కాంపౌండ్ వాల్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం బస్ స్టాండ్ ఆధునీకరణకు 2 కోట్ల నిధులు మంజూరు చింతామణి చెరువు, తమ్మల్ల కుంట సుందరీకరణ 13 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం రోళ్లవాగు ప్రాజెక్టు దాదాపు పూర్తి ధర్మపురి టెంపుల్ సిటీ అభివృద్ధికి 100 కోట్ల నిధులు అంబేద్కర్ భవనం నిర్మాణానికి 2 కోట్ల మంజూరు మున్సిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థ, వాటర్ ట్యాంకుల నిర్మాణం అనేక గ్రామాల్లో రోడ్లు, చెరువులు, సంఘ భవనాల నిర్మాణం కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అనేక అభివృద్ధి పనులకు మంజూరైన నిధులు క్యాన్సల్ అయ్యాయని, రోడ్లు, రాజగోపురాలు, స్మశానవాటికలు, STP ప్రాజెక్టులు మధ్యలోనే నిలిచిపోయాయని కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. లక్ష్మణ్ కుమార్ గెలిచి రెండేళ్లు పూర్తైనా కొత్తగా చెప్పుకోదగిన అభివృద్ధి ఏదీ చేయలేదని, ఇప్పడు చెబుతున్న ప్రతిపాదనలన్నీ బీఆర్ఎస్ హయాంలో రూపొందించినవేనని అన్నారు. సామాజిక కార్యక్రమాలు: ప్రభుత్వ అభివృద్ధితో పాటు CMRF, LOCల ద్వారా పేదలకు సహాయం చేశామని, మెడికల్ క్యాంపులు, ఉచిత కోచింగ్ సెంటర్లు, క్రీడా పోటీలు, మహిళల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈ ప్రెస్‌మీట్‌లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. #Dharmapuri #KoppulaEshwar #BRS #PoliticalNews #DevelopmentDebate #TelanganaPolitics #PressMeet #LocalNews Follow us on Website Facebook Instagram YouTube