BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

మద్యప్రవాహానికి అడ్డుకట్టే లేదా?

తెలంగాణ
11 Jan, 2026 - 03:09 AM
226 వీక్షణలు

మద్యప్రవాహానికి అడ్డుకట్టే లేదా?

డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు-కేంద్ర మాజీ మంత్రి, ఏపీ శాసన పరిషత్ సభ్యులు NTODAY NEWS: ప్రత్యేక కథనం ఆంగ్ల నూతన సంవత్సర ఆరంభ వేళ యావత్ భారతావని సిగ్గుతో తలదించుకోవాల్సిన దృశ్యాలు దేశవ్యాప్తంగా దర్శనమిచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీ మొదలుకొని హైదరాబాద్, విజయవాడ వరకు నగరాలన్నీ ఒకే రకమైన అనాగరిక ప్రవర్తనకు వేదికలయ్యాయి. మద్యం మత్తులో మునిగిపోయిన మందుబాబులు రోడ్లపై చేసిన వీరంగం చూస్తే, వెనుకబడిన దేశాల్లో కూడా ఇలాంటి వికృత చేష్టలు ఉంటాయా అన్న భావన కలుగుతుంది. పీకల దాకా తాగి తామేం చేస్తున్నామో కనీస స్పృహ లేకుండా ఫుట్‌పాత్‌లపై పడిపోవడం, వాంతులు చేసుకోవడం, శాంతిభద్రతలను కాపాడే పోలీసులతో వాగ్వాదానికి దిగడం వంటి దృశ్యాలు సమాజాన్ని కలవరపెట్టాయి. కొత్త సంవత్సరాన్ని స్వాగతించడం అంటే మద్యం, గంజాయి, ఇతర మత్తు పదార్థాల్లో మునిగి పోవడమేనా? అన్న ప్రశ్న అనివార్యంగా ముందుకొస్తుంది. దేశంలోని 29 రాష్ట్రాల గణాంకాలను పరిశీలిస్తే, డిసెంబర్ 31న జరిగిన మద్యం అమ్మకాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 1 వరకు కేవలం మూడు రోజుల్లోనే తెలంగాణలో రూ.1,671 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ వాటా అత్యధికం. ఒక నిమిషానికి తెలంగాణలో 95 బాటిళ్లు, ఆంధ్రప్రదేశ్‌లో 93 బాటిళ్లు అమ్ముడయ్యాయంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. పెట్టుబడుల ఆకర్షణలో పోటీ పడాల్సిన రాష్ట్రాలు, మద్యం అమ్మకాల్లో పోటీ పడటం శోచనీయం. యువత భవితవ్యం ప్రశ్నార్థకం మద్యం అలవాటు క్రమంగా గంజాయి, ఇతర ప్రమాదకర మత్తుపదార్థాల వైపు దారి తీస్తోంది. విదేశీ వికృత సంస్కృతికి అద్దం పట్టే రేవ్ పార్టీలూ నగరాల శివార్లలోని ఫామ్‌హౌస్‌లలో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్నాయి. పోలీసులు దాడులు చేసి కేసులు పెడుతున్నా, డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా అరికట్టలేకపోతున్నారు. కేవలం మద్యం వినియోగానికే పరిమితం కాకుండా యువత మాదక ద్రవ్యాల చీకటి వ్యాపారంలో చిక్కుకుంటోంది. అంతర్జాతీయ ముఠాల ప్రమేయంతో సరిహద్దులు దాటి మత్తు పదార్థాలు దేశంలోకి ప్రవేశిస్తున్నాయి. మరీ దారుణమైన విషయం ఏమిటంటే, స్కూల్ పిల్లలు ఇష్టంగా తినే చాక్లెట్లలో కూడా మత్తు పదార్థాలు కలిపి విక్రయిస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. భావి పౌరులుగా ఎదగాల్సిన విద్యార్థులు చిన్న వయసులోనే వ్యసనాలకు బానిసలైతే దేశ భవిష్యత్తు ఏమవుతుంది? తల్లిదండ్రులు తమ కష్టార్జితాన్ని పిల్లల చదువుల కోసం ఖర్చు చేస్తుంటే, అదే పిల్లలు మత్తులో జోగుతున్నారని తెలిసినప్పుడు వారి మనస్థితి ఎలా ఉంటుందో ఊహించడమే కష్టం. మాదక ద్రవ్యాల సరఫరాను అడ్డుకోవడానికి అత్యాధునిక సాంకేతికతతో కూడిన, సుశిక్షిత పోలీసు యంత్రాంగం అవసరం. కానీ అనేక రాష్ట్రాల్లో అటువంటి ప్రత్యేక నియంత్రణ వ్యవస్థలు లోపిస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో వ్యవసాయం ముసుగులో గంజాయి సాగు చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే కుట్రలు సాగుతున్నాయి. మానవ వనరులను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా సాగుతున్న ఈ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాల ద్వంద్వ ప్రమాణాలు మరోవైపు ప్రభుత్వాల ద్వంద్వ నీతి తీవ్ర విమర్శలకు తావిస్తోంది. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రభుత్వాలు, మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంపై ఎందుకు ఆధారపడుతున్నాయి? మద్యం కూడా ఒక మత్తు పదార్థమే కదా! దానివల్ల కలిగే అనర్థాలపై ఎందుకు విస్తృత ప్రచారం జరగడం లేదు? ఆదాయం కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం ఏ రకమైన అభివృద్ధి? మత్తు పదార్థాల ద్వారా వచ్చే ఆదాయాన్ని రాబడిగా పరిగణించకూడదని భారత రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. మద్యపానం మనిషి శారీరక, నైతిక, మేధోపరమైన పతనానికి దారితీస్తుందని మహాత్మా గాంధీ ఎప్పుడో హెచ్చరించారు. గాంధీ పుట్టిన గుజరాత్‌లో మద్యపాన నిషేధం అమలులో ఉన్నప్పటికీ, దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో మద్యం ఏరులై పారుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న మద్యంలో పదో వంతు భారతదేశంలోనే వినియోగం అవుతున్నట్లు ‘లాన్‌సెట్’ నివేదికలు చెబుతున్నాయి. కల్తీ సారా, గుడుంబా వంటి ప్రాణాంతక పదార్థాల వల్ల ఎంతో మంది అకాల మృత్యువాత పడుతున్నారు. మద్యం తయారీ పరిశ్రమ వేగంగా విస్తరిస్తోందని పరిశ్రమల సంఘాల నివేదికలు దేశ ఆరోగ్య స్థితిగతులకు అద్దం పడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా స్పందించి మత్తు ప్రవాహాన్ని అరికట్టడానికి ఉమ్మడి కార్యాచరణ రూపొందించాలి. లేనిపక్షంలో 2047 నాటికి మనం కలలుగంటున్న ‘వికసిత్ భారత్’ కాస్తా ‘మద్యపాన భారత్’గా మారే ప్రమాదం ఉంది. అభివృద్ధి అంటే కేవలం భవనాలు, పరిశ్రమలే కాదు—ఆరోగ్యవంతమైన సమాజం కూడా. మన ప్రయాణం ఏ దిశగా సాగుతోందో ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇదే. Follow us on Website Facebook Instagram YouTube