BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 19 May 2026, 05:47 pm
Posted by : V శ్రీనివాస్

​జిల్లా సరిహద్దుల్లో నిరంతర నిఘా..

తెలంగాణ
/ మంచిర్యాల / చెన్నూర్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
19 May, 2026 - 05:47 PM
136 వీక్షణలు

​జిల్లా సరిహద్దుల్లో నిరంతర నిఘా.. అంతరాష్ట్ర చెక్ పోస్ట్‌ను తనిఖీ చేసిన డీసీపీ

​బార్డర్లలో అలర్ట్: రాపనపల్లి చెక్‌పోస్ట్ వద్ద డీసీపీ భాస్కర్ మెరుపు తనిఖీలు!

​పశువుల అక్రమ రవాణా, దొంగ ధాన్యంపై ఉక్కుపాదం!

​మంచిర్యాల బ్యూరో, మే 19:

బక్రీద్ పండుగ వేళ అక్రమార్కులకు అడ్డుకట్ట వేసేందుకు మంచిర్యాల పోలీసులు బార్డర్లలో నిఘా ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ మంగళవారం కోటపల్లి మండలం రాపనపల్లి సరిహద్దు చెక్‌పోస్ట్‌ను జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, డ్యూటీల కేటాయింపు, రిజిస్టర్లను స్వయంగా పరిశీలించి గ్రౌండ్ లెవెల్ లో భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు.

​అక్రమ రవాణాపై 'నో కాంప్రమైజ్'..

ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. పండుగ తరుణంలో జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణే మొదటి ప్రాధాన్యత అన్నారు. అంతరాష్ట్ర సరిహద్దుల గుండా జరిగే ప్రతి కదలికపైనా 24/7 వాచ్ ఉంటుందని స్పష్టం చేశారు. అంతరాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద विभिन्न శాఖల అధికారులు, పోలీసులు కో-ఆర్డినేషన్‌తో పనిచేయాలని సూచించారు.

​రిజిస్టర్లలో ప్రతి వాహనం వివరాలు ఉండాల్సిందే!

సరిహద్దులు దాటే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా స్క్రీనింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా పశువుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని, అలాగే మహారాష్ట్ర నుంచి వచ్చే అక్రమ వరి ధాన్యం లారీలపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. తనిఖీ చేసిన ప్రతి వాహనం వివరాలను తప్పనిసరిగా రిజిస్టర్లలో ఎంటర్ చేయాలని సిబ్బందికి గట్టి ఆదేశాలు జారీ చేశారు