BREAKING
thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV
Date of Publish : 15 May 2026, 07:18 pm
Posted by : ఇప్పలపల్లి నరేందర్

TGMSIDC శాఖల పనితీరుపై సమీక్ష సమావేశం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / భువనగిరి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
15 May, 2026 - 07:18 PM
171 వీక్షణలు

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ, తెలంగాణ వైద్య విధాన పరిషత్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, మరియు TGMSIDC శాఖల పనితీరుపై సమీక్ష సమావేశం 

కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్  అనురాగ్ జయంతి, ఐఏఎస్  ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ, తెలంగాణ వైద్య విధాన పరిషత్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, యాదాద్రి భువనగిరి జిల్లా మరియు TGMSIDC శాఖల పనితీరుపై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించబడింది.ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులతో ప్రతేక్ష్య సమీక్ష చేపట్టారు. సమావేశంలో ఆరోగ్య కేంద్రాల NQAS సర్టిఫికేషన్, T-Hub ద్వారా నిర్వహించిన డయాగ్నస్టిక్ పరీక్షలు, ఆసుపత్రుల్లో పెండింగ్‌లో ఉన్న సివిల్ వర్క్స్,చట్టబద్ధ సమావేశాల పెండింగ్,గర్భిణి స్త్రీల నమోదు మరియు 3 మరియు 4 ప్రభుత్వ హాస్పిటల్ చెక్ అప్స్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీల వివరాలు,TB గుర్తింపు లక్ష్యాలు,NCD స్క్రీనింగ్, క్యాన్సర్ స్క్రీనింగ్, RBSK నివేదిక తదితర అంశాలపై విస్తృతంగా సమీక్షించారు. అదేవిధంగా GGH, ఏరియా ఆసుపత్రులు మరియు CHCs నుండి OP, IP, డెలివరీలు, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య మహిళ, TIFFA స్కాన్లు, పరికరాల లోపాలు, రియాజెంట్స్ కొరతలు తదితర వివరాలను సేకరించవలసిందిగా ఆదేశించారు.ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలో NCD కార్యక్రమంలో తక్కువ పనితీరు ఉన్న కేంద్రాల్లో స్క్రీనింగ్‌ను పెంచాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో పెండింగ్‌లో ఉన్న సివిల్ వర్క్స్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని TGMSIDC అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎంపిక చేసిన కేంద్రాల్లో NQAS ప్రిపరేషన్‌ను పూర్తిచేసి, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులు కనీసం 80% స్కోర్ సాధించాలన్నారు. జూన్ నెలలో జరిగే స్టేట్ అసెస్‌మెంట్‌కు ముందు అన్ని ఎంపిక చేసిన కేంద్రాల్లో ఇంటర్నల్ అసెస్‌మెంట్ పూర్తిచేయాలని సూచించారు.అదేవిధంగా హీట్ వేవ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించడానికి ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. RBSK టీమ్స్ ద్వారా కౌమార  బాలికలలో అనీమియా స్క్రీనింగ్ నిర్వహించాలని,మరియు విద్యా సంవత్సరం కార్యాచరణ ప్రణాళిక ముందస్తుగా తయారు చేయవలసిందిగా సూచించారు.అలాగే జిల్లాలో నిర్వహిస్తున్న క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాల పురోగతిని సమీక్షించి, జిల్లా వారీగా క్యాన్సర్ స్క్రీనింగ్ వివరాలు మరియు క్యాన్సర్ వ్యాధి గ్రస్తుల సంఖ్యపై పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. యదాద్రి భువనగిరి జిల్లా లో నర్సింగ్ కాలేజీ, యాదగిరిగుట్టలోని 100 పడకల ఆసుపత్రి, చౌటుప్పల్ CHC, రామన్నపేట CHC మరియు భువనగిరి GGHలో కొనసాగుతున్న సివిల్ వర్క్స్‌ను నిర్ణీత గడువుల్లోనే వేగవంతంగా పూర్తి చేయాలన్నారు, పనుల పురోగతిని నిరంతరం సమీక్షిస్తూ ఎటువంటి ఆలస్యం లేకుండా అమలు చేయాలని TGMSIDC, EE, అధికారులను  కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. మనోహర్ గారు, DCHS డా. ఎం.ఎస్. చిన్న నాయక్ గారు, GGH సూపరింటెండెంట్ డా. పాండు నాయక్ గారు, CHC ఆలేర్ డా. స్వప్న రాథోడ్ గారు, CHC రామన్నపేట డా. శ్వేత ప్రియాంక గారు, TGMSIDC ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ప్రోగ్రామ్ ఆఫీసర్లు మరియు అన్ని వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.