BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 17 March 2026, 02:17 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

జనగణనపై పూర్తి అవగాహనతో ముందుకెళ్లాలి

తెలంగాణ
/ కరీంనగర్
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
17 Mar, 2026 - 02:17 PM
249 వీక్షణలు
జనగణన-2027 శిక్షణ కార్యక్రమంలో అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం

జనగణన-2027 కోసం ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను అధికారులు సద్వినియోగం చేసుకొని, పూర్తి అవగాహనతో ముందుకెళ్లాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మర్రి చిన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు.
​ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జనగణన కోసం రూపొందించిన యాప్ రిజిస్ట్రేషన్, పనితీరుపై స్పష్టత కలిగి ఉండాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నివృత్తి చేసుకోవాలని, నవీకరించిన మార్గదర్శకాల ప్రకారం సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. టెక్నికల్ అంశాలు, నియమ నిబంధనలపై పట్టు సాధించాలని అధికారులకు తెలిపారు.
​ఈ శిక్షణలో మండల ఛార్జ్ అధికారులు (తహసిల్దార్లు), అదనపు ఛార్జ్ అధికారులు (నాయబ్ తహసిల్దార్లు), పట్టణ ఛార్జ్ అధికారులు (మున్సిపల్ కమిషనర్లు) మరియు టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మహేశ్వర్, జడ్పీ సీఈవో శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, సిపిఓ రామ్ దత్తారెడ్డి తదితరులు పాల్గొన్నారు.