BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 11 April 2026, 12:40 pm
Posted by : బోధపల్లి వేణు

జ్ఞాన జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
11 Apr, 2026 - 12:40 PM
119 వీక్షణలు

జ్ఞాన జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా

పాలకుర్తి రిపోర్టర్ వేణు 

జ్ఞానజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్ .

సామాజిక అసమానతలు, కుల వివక్ష, అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి సమాజంలో సమానత్వం వెలుగులు నింపేందుకు తన సంపూర్ణ జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే .

మహిళల విద్యకు నాంది పలికి, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడి, ప్రతి మనిషికి సమాన అవకాశాలు ఉండాలనే మహోన్నత భావనను సమాజంలో నాటిన గొప్ప సంఘ సంస్కర్త ఆయన. విద్య ద్వారా సమాజాన్ని మార్చవచ్చని ఆయన చూపిన మార్గం ఈ రోజుకీ మనకు దిక్సూచి.

ఈ రోజు (ఏప్రిల్ 11) ఆయన జయంతి సందర్భంగా, దళితులు, మహిళలు మరియు పీడిత వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను మన జీవితాల్లో ఆచరణలో పెట్టాలని మనమందరం సంకల్పిద్దాం.

ఆయన చూపిన సమానత్వ మార్గంలో నడుస్తూ, సమాజంలో ప్రతి ఒక్కరికీ న్యాయం, గౌరవం, అవకాశాలు అందేలా కృషి చేయడం మన బాధ్యత.

మహాత్మా జ్యోతిరావు పూలే  ఆశయాలు సాకారం కావాలి అని తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూణం శ్రవణ్ అన్నారు.

కార్యక్రమంలో జ్యోతిరావు పూలే జయంతి కమిటీ నిర్వాహకులు సోమారపు ఐలయ్య, కాంగ్రెస్ పట్టణ పార్టీ అధ్యక్షులు సోమ రాజశేఖర్,పదో వార్డ్ కౌన్సిలర్ ముద్దసాని సురేష్, డాక్టర్ రామ్ నరసయ్య, ఎంఈఓ బుచ్చయ్య, కొత్తపల్లి రవి, చిట్టి మల్ల మహేష్, రాయిశెట్టి వెంకన్న, రాయిశెట్టి ఉపేందర్, యాకమల్లు మంగళపల్లి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు