BREAKING
సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! SIR మ్యాపింగ్‌పై అపోహలు తొలగించాలి గాలివారిగూడెంలో ఘనంగా ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక గ్రామ సభ నరసరావుపేటలో రేషన్ బియ్యం పట్టివేత. రక్త పరీక్షలకు ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి చిలకలూరిపేట మోటార్ వర్కర్స్ దశాబ్దాల కల ఏపీ పీసెట్ ఎగ్జామినర్ గా చిలకలూరిపేటకు చెందిన ప్రవీణ్ నియామకం సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! SIR మ్యాపింగ్‌పై అపోహలు తొలగించాలి గాలివారిగూడెంలో ఘనంగా ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక గ్రామ సభ నరసరావుపేటలో రేషన్ బియ్యం పట్టివేత. రక్త పరీక్షలకు ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి చిలకలూరిపేట మోటార్ వర్కర్స్ దశాబ్దాల కల ఏపీ పీసెట్ ఎగ్జామినర్ గా చిలకలూరిపేటకు చెందిన ప్రవీణ్ నియామకం
www.ntodaynews.com

​జూన్ 21న నీట్-2026 పరీక్ష.. ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలి: సీఎస్ రామకృష్ణారావు

తెలంగాణ
/ తెలంగాణ / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
06 Jun, 2026 - 06:12 PM
84 వీక్షణలు

​మంచిర్యాల జిల్లాలో 5 కేంద్రాలు.. 1,204 మంది అభ్యర్థులు: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

​రాష్ట్రంలో జూన్ 21వ తేదీన జరగనున్న నీట్-2026 పరీక్ష ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (సీఎస్) రామకృష్ణారావు అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి అదనపు డీజీపీ మహేష్ భగవత్, పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్రలతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, సీపీలు, ఇతర ఉన్నతాధికారులతో దృశ్య శ్రవణ సమావేశం (వీడియో కాన్ఫరెన్స్) ద్వారా నీట్-2026 పరీక్ష నిర్వహణ ఏర్పాట్లు, వరి ధాన్యం కొనుగోలు, జూన్ 9న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి సభ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా జూన్ 21న జరగనున్న నీట్ పరీక్షకు 24 పట్టణాలలో 208 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, 72 వేల 956 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, ఇందుకు తగిన ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని తెలిపారు. పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ సంస్థలలో మాత్రమే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి, అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

​పరీక్ష రోజున ప్రశ్న పత్రాల తరలింపు, అభ్యర్థుల రిజిస్ట్రేషన్, బయోమెట్రిక్ వెరిఫికేషన్, అభ్యర్థుల తనిఖీ, బందోబస్తు తదితర ఏర్పాట్లను ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేపట్టాలని సీఎస్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులపై తక్షణమే స్పందించి, వదంతులు వ్యాప్తి కాకుండా చూడాలని, మహిళా అభ్యర్థుల తనిఖీలో మహిళా కానిస్టేబుల్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అదనపు డీజీపీ మహేష్ భగవత్ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం దృష్ట్యా పరీక్ష నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. వీటితో పాటు, జూన్ 12న రాష్ట్రంలోని పాఠశాలల పునః ప్రారంభానికి విద్యార్థులకు అందజేయవలసిన యూనిఫామ్‌లతో సిద్ధంగా ఉండాలని తెలిపారు.

​ఇదే సమావేశంలో వరి ధాన్యం కొనుగోళ్లు, సీఎం సభ ఏర్పాట్లపై సీఎస్ సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 71 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసి 4 వేల 488 కొనుగోలు కేంద్రాలను మూసి వేయడం జరిగిందని, ఇప్పటి వరకు 10 లక్షల 58 వేల మంది రైతుల ఖాతాలలో 13 వేల 577 కోట్ల రూపాయల కనీస మద్దతు ధర జమ చేయడం జరిగిందని తెలిపారు. మిగిలిన ధాన్యాన్ని కూడా త్వరితగతిన కొనుగోలు చేయాలన్నారు. అలాగే, రాష్ట్రంలోని ప్రతి మండల మహిళా సమాఖ్యకు 1 చొప్పున 553 బస్సులను మంజూరు చేయడం జరిగిందని, ఈ బస్సులను జూన్ 9వ తేదీన సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా మహిళా సమాఖ్య సభ్యులకు లాంఛనంగా అందజేయడం జరుగుతుందని, ఈ సభను విజయవంతం చేయడానికి ఆర్టీసీ రీజినల్ మేనేజర్లు, గ్రామీణ అభివృద్ధి అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు

​వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, జిల్లాలో 1 వేయి 204 మంది అభ్యర్థులు నీట్-2026 పరీక్షకు హాజరు కానున్నారని, పరీక్ష నిర్వహణ కొరకు జిల్లాలో 5 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకున్నామని తెలిపారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, వర్షాల దృష్ట్యా కొనుగోలు కేంద్రాలలో టార్పాలిన్లు అందుబాటులో ఉంచడం జరిగిందని, రవాణా సంబంధిత ఏర్పాట్లు చేశామని, తడిసిన ధాన్యాన్ని వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించడం జరుగుతుందని వివరించారు. ఈ సమావేశంలో జిల్లా డీసీపీ భాస్కర్, అదనపు కలెక్టర్ వి.రాములు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, జిల్లా విద్యాశాఖాధికారి లలిత, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావు, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శ్రీకళ మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు