BREAKING
శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష
Date of Publish : 06 June 2026, 08:03 am
Posted by : కూనురు మధు

జర్నలిస్టు పిల్లలకు ప్రవేట్ పాఠశాలలో ఫీజు రాయితి ఇవ్వాలి

తెలంగాణ
/ నల్గొండ
06 Jun, 2026 - 08:03 AM
174 వీక్షణలు

యూ డబ్ల్యూ  జే ( ఐజేయు )ఆధ్వర్యంలో డిఈఓకు వినతి పత్రం అందజేత

నల్గొండ జిల్లాలో వివిధ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న జర్నలిస్టు పిల్లలకు ఫీజుల్లో  రాయితీ ఇవ్వాలని టి యు డబ్ల్యూ జె ( ఐ జె యూ ) ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్రావు రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేయుచున్న జర్నలిస్టు పిల్లలు వివిధ ప్రవేట్ పాఠశాలలో చదువుతున్నారని అన్నారు. ప్రవేటు పాఠశాలలో వేలాది రూపాయలు ఫీజులు చెల్లించాల్సి ఉండటంతో ఆ ఫీజులను చెల్లించలేక చాలా ఇబ్బందులు పడుచున్నారు. పాఠశాల మేనేజ్మెంటు వారు ఫీజులు చెల్లించాలని వత్తిడి చేయడంతో కొందరు విద్యార్థిని విద్యార్థులు ఫీజులు చెల్లించలేక మధ్యలోనే విద్యను నిలుపుదల చేయుచున్నారు. జర్నలిస్టు కుటుంబంలోని ఒకరికి పూర్తి రాయితిని, ఇంకొకరికి 50%, మరొకరి 30% రాయితీని ఇతర జిల్లాలో కల్పించడం జరుగుచున్నది.కావున మన నల్లగొండ జిల్లాలోని జర్నలిస్టు పిల్లలకు 75% ఫీజు రాయితీని కల్పించగలరని అదేవిధంగా వెంటనే తగిన ఉత్తర్వులు జారీ చేయగలరని కోరుచున్నాము. వినతి పత్రం అందజేసిన వాళ్ళు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పులిమామిడి మహేందర్ రెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు పరమేష్ , సంఘం నాయకులు మాదరి యాదగిరి, ఎర్రెడ్ల చంద్రశేఖర్ రెడ్డి, చిన్న పత్రికల సంఘం జిల్లా అధ్యక్షులు అబ్బోజు మదనాచారి, గౌరవ అధ్యక్షులు గంగాధర వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పిట్టల రామకృష్ణ , కోశాధికారి పొట్టుముత్తు అశోక్, జర్నలిస్టులు వంగాల  శ్రీనివాసరెడ్డి, ఎండి సయ్యద్, దశరథ ఉయ్యాల లింగయ్య  డిఎస్ యాదవ్, దొటి శ్రీనివాస్, సోమచంద్రశేఖర్, వుర రమేష్ , ఎస్ రాంప్రసాద్, టి. శంకర్ పాల్గొన్నారు.