BREAKING
thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
Date of Publish : 31 May 2026, 02:36 pm
Posted by : V శ్రీనివాస్

​కాంగ్రెస్ పార్టీ పదవుల్లో పద్మశాలీయులకు తీవ్ర అన్యాయం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
31 May, 2026 - 02:36 PM
181 వీక్షణలు

జిల్లా కమిటీల్లో సముచిత స్థానం కల్పించాలి: శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి స్వచ్ఛంద సేవా సంస్థ

​ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఉమ్మడి ఆదిలాబాద్ మరియు మంచిర్యాల జిల్లాల మండల, పట్టణ కమిటీలలో పద్మశాలి సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి స్వచ్ఛంద సేవా సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. గత అసెంబ్లీ, మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం పద్మశాలీలు తీవ్రంగా కృషి చేశారని, అయినా పదవుల పెంపకంలో తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. 1978 నుండి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం చివరి శ్వాస వరకు శ్రమించిన తాటిపాముల నాగయ్య, పసుపునూరి రంగయ్య, జంజీరాల రాజం, మీసాల నర్సయ్య వంటి పద్మశాలి నాయకుల సేవలను రాష్ట్ర, జిల్లా నాయకత్వం విస్మరించడం బాధాకరమని సభ అభిప్రాయపడింది.

​ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ పెద్దలు స్పందించి జిల్లా, మండల, మున్సిపల్ కమిటీల్లో పద్మశాలీయులకు సముచిత స్థానం కల్పించాలని, లేనిపక్షంలో రాబోయే ZPTC, MPTC ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని నాయకులు హెచ్చరించారు. "రాజ్యాధికారంలో వాటా - సామాజిక న్యాయం" కోసం పద్మశాలీయులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక అధ్యక్షుడు, బీసీ సంఘాల నాయకుడు గజెల్లి వెంకటయ్యతో పాటు పద్మశాలి సంఘం నాయకులు వేముల అశోక్, చిప్ప రామస్వామి, జంజీరాల నారాయణ, అడిచర్ల రాజేశం, పరిసె శ్రీనివాస్, డి. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు