BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

ఎమ్మార్వో కు వినతి పత్రం ఇచ్చిన బిజెపి

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి
Reporter
రాఘవేంద్ర కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రతినిధి
17 Mar, 2026 - 09:14 AM
53 వీక్షణలు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు అయ్యేలా  చూడాలని దుండిగల్ ఎమ్మార్వో కు వినతి పత్రం ఇచ్చిన బిజెపి 

నెరవేర్చని రాష్ట్ర ప్రభుత్వం ఆరు హామీలను తక్షణమే అమలు చేయాలని, అలాగే మండల రెవెన్యూ అధికారిగా దుండిగల్ పరిధిలోని ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ బీజేపీ తరఫున వినతిపత్రం ఇచ్చారు. బిజెపి అధ్యక్షుడు పిసరీ కృష్ణ రెడ్డి మాట్లాడుతు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగిందన్నారు.. కానీ వాటిలో ఏ ఒక్క హామీ కూడా ఇప్పటివరకు పూర్తిగా అమలు కాలేదన్నారు ముఖ్యంగా యువతకు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, వృద్ధాప్య, వితంతు మరియు దివ్యాంగులకు పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, పేదలకు గృహ నిర్మాణ పథకం, రైతులకు రైతు భరోసా, భూ సమస్యల పరిష్కారం వంటి అనేక హామీలు ఇప్పటికీ అమలు కావడం లేదన్నారు . ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకొని ఓటు వేసిన ప్రజలు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారన్నారు.మండలంలో రైతులు తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా సమయానికి అందకపోవడంతో రైతులు పెట్టుబడుల కోసం అప్పులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు అలాగే వృద్ధాప్య, వితంతు మరియు దివ్యాంగులకు ప్రభుత్వం అందించే ఆసరా పెన్షన్లు అర్హులైన లబ్ధిదారులకు అందడంలేదన్నారు మండలంలో దరఖాస్తులు చేసుకున్న అనేక మంది వృద్ధులు, వికలాంగులు మరియు ఒంటరి మహిళలకు ఇప్పటికీ పెన్షన్లు మంజూరు కాలేదు. అర్హులైన అభ్యర్థులందరి దరఖాస్తులను వెంటనే ఆమోదించి వారికి పెన్షన్లు అందించాలని కోరుతున్నాము.పేదలకు ప్రభుత్వం ప్రకటించిన గృహ నిర్మాణ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు వెంటనే ఇళ్లు మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని మనవి చేస్తున్నాము.కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సుల్లో ప్రజలు దరఖాస్తులు సమర్పించినప్పటికీ వారి సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. ఆ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నాము.గ్రామాల్లో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాలు మరియు వీధి దీపాలు వంటి ప్రాథమిక సదుపాయాలు సరైన విధంగా అందడం లేదు. ఈ సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలి.అలాగే నివాస, ఆదాయ మరియు కుల ధృవీకరణ పత్రాల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక ప్రభుత్వ పథకాలకు ఈ పత్రాలే ప్రామాణికం కావడంతో నిర్ణీత సమయంలో ధృవీకరణ పత్రాలను జారీ చేసి అర్హులు నష్టపోకుండా చూడాలి.అందువల్ల పై సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి మండల పరిధిలోని ప్రజా సమస్యలను పరిష్కరించాలని మనవి చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శి డి విగ్నేశ్వర చారి,రాష్ట్ర ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షులు సెన్సార్ బోర్డు మెంబర్ దాసరి శ్యామ్ రావు, జిల్లా ఉపాధ్యక్షురాలు బౌరంపేట్ మాజీ సర్పంచ్ కొమ్ము మంగమ్మ, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు గోనెమల్లారెడ్డి, సీనియర్ నాయకులు ఏ శ్రీశైలం యాదవ్,దమ్మగారి ప్రభాకర్ రెడ్డి,రాళ్లబండ్ల నరసింహ చారి, నర్సింగ్ రావ్, ఎం వెంకటేష్ నాయక్,మున్సిపల్ ప్రధాన కార్యదర్శులు దమ్మగారి సీతారాoరెడ్డి తురాయి భాను గౌడ్,ఉపాధ్యక్షరాలు ఎన్ రోజా కార్యదర్శి తలారి రాజ్ కుమార్,యువమోర్చ నాయకులు ఎం అతీష్ బాబు, ఆకుల యశ్వంత్ పటేల్ బిజెపి సీనియర్ నాయకులు  పి మాధవరెడ్డి,అందె అశోక్, కుమ్మరి నాగరాజు, వై లక్ష్మికాంత్ రెడ్డి,నల్ల మాధవరెడ్డి,వై జంగారెడ్డి,శ్రీధర్ గౌడ్, సార నవీన్, సిహెచ్ నవీన్ కుమార్, చిన్న ముదిరాజ్,టింకు, గణేష్ తదితరులు పాల్గొన్నారు