BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 12 April 2026, 09:27 pm
Posted by : కూనురు మధు

కాఫీ డే లో చెలరేగిన మంటలు : తప్పిన పెను ప్రమాదం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
12 Apr, 2026 - 09:27 PM
428 వీక్షణలు

కాఫీ డే లో చెలరేగిన మంటలు : తప్పిన పెను ప్రమాదం

చిట్యాల నార్కట్పల్లి జాతీయ రహదారిపై ఉన్న  ‘కాఫీ డే’ అవుట్‌లెట్ వెనుక భాగంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ​కాఫీ డే వెనుక భాగంలో నిల్వ ఉంచిన కట్టెలకు  ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించి, సమీపంలోనే ఉన్న జనరేటర్ మరియు ఏసీ యూనిట్ల మధ్యకు చేరుకున్నాయి. మంటలు జనరేటర్‌కు గనుక తగిలి ఉంటే భారీ పేలుడు సంభవించి పెను నష్టం జరిగేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ​ప్రమాద సమాచారం అందిన వెంటనే రామన్నపేట అగ్నిమాపక శాఖ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు ఇతర విభాగాలకు వ్యాపించకుండా చాకచక్యంగా వ్యవహరించి, నీటిని చల్లి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. సకాలంలో ఫైర్ ఇంజిన్ రావడం వల్ల ఒక పెద్ద ప్రమాదం తప్పింది.  ఆస్తి నష్టం,  ప్రాణాపాయం కూడా తప్పిందని స్థానికులు కొనియాడారు. వేసవి కాలం దృష్ట్యా వాణిజ్య సముదాయాలు తమ జాగ్రత్తలు తీసుకోవాలని ఫైర్ సిబ్బంది తెలిపారు అంతేకాకుండా ఎండు గడ్డి, కట్టెలు వంటి మండే స్వభావం గల వస్తువులను ఉంచకూడదని, అగ్నిమాపక నిబంధనలు పాటించాలని అగ్నిమాపక అధికారులు సూచించారు..