BREAKING
thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Date of Publish : 25 March 2026, 09:41 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కెమెరాలే నిరసన ప్రకటిస్తే… ఢిల్లీలో జర్నలిస్టుల ఆవేదనకు ప్రతీక

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Mar, 2026 - 09:41 PM
200 వీక్షణలు

కెమెరాలే నిరసన ప్రకటిస్తే… ఢిల్లీలో జర్నలిస్టుల ఆవేదనకు ప్రతీక

ఢిల్లీలో నిన్న చోటుచేసుకున్న సంఘటనలు మీడియా స్వేచ్ఛపై మరోసారి తీవ్ర చర్చకు దారితీశాయి. ఒక విద్యార్థిపై పోలీసులు లాఠీచార్జ్ చేస్తుండగా, ఆ దృశ్యాన్ని హిందుస్తాన్ టైమ్స్ విలేఖరి అనుశ్రీ తన కెమెరాలో బంధించేందుకు ప్రయత్నించింది. అయితే అక్కడున్న ఓ పోలీసు అధికారి “ఆమె కెమెరా పగులగొట్టండి” అంటూ ఆదేశించడంతో, పోలీసులు ఆమెపై దాడి చేసి కెమెరాను లాక్కున్నట్లు సమాచారం.

అదే సమయంలో మరో మహిళా జర్నలిస్టును ఒక పోలీసు అధికారి ఛాతీపై చెయ్యి వేసి వెనక్కి తోసిన ఘటన కలకలం రేపింది. అనంతరం ఆమెను విద్యార్థిని అనుకుని తోశామని పోలీసులు వివరణ ఇచ్చినా, ఈ చర్యపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలపై ఇటువంటి ప్రవర్తనను ఎలా సమర్థించగలరని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఇదిలా ఉండగా, ఫస్ట్ పోస్ట్ విలేఖరి ప్రవీణ్ సింగ్ చేతికి తీవ్ర గాయం కాగా, మరికొందరు జర్నలిస్టులు కూడా గాయపడ్డారు.

ఈ ఘటనకు నిరసనగా ఇవాళ ఢిల్లీలో ఫోటో జర్నలిస్టులు పోలీస్ ప్రధాన కార్యాలయం ఎదుట తమ కెమెరాలను నేలపై ఉంచి నిరసన తెలిపారు. “చిత్రాలు అక్షరాల కంటే ఎక్కువగా మాట్లాడతాయి” అన్న మాటకు నిదర్శనంగా నిలిచిన ఈ దృశ్యం, మీడియాపై దాడులకు ప్రతీకగా మారింది.