BREAKING
thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం.
Date of Publish : 03 August 2026, 08:55 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కొత్త టెక్నాలజీతో ఇంటర్ మెమోలు.. ఇక చిరగవు, తడవవు!

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Aug, 2026 - 08:55 PM
43 వీక్షణలు

కొత్త టెక్నాలజీతో ఇంటర్ మెమోలు.. ఇక చిరగవు, తడవవు!

హైదరాబాద్, ఆగస్టు 3: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త. ఇకపై ఇంటర్ మెమోలు చిరిగిపోవడం, తడిసి పాడవడం వంటి సమస్యలకు చెక్ పడనుంది. ఈ ఏడాది నుంచే నాన్ టియరబుల్ టెక్నాలజీతో రూపొందించిన ఆధునిక మెమోలను అందించాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది.

ఈ మేరకు 2026 విద్యా సంవత్సరంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణులైన సుమారు 4 లక్షల మంది విద్యార్థులకు ఆగస్టు 15లోగా కొత్త తరహా మెమోలను పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇప్పటివరకు కాగితంపై ముద్రించిన మెమోలు వర్షాలు, వరదలు లేదా నిర్లక్ష్యంతో దెబ్బతినడం వల్ల విద్యార్థులు ఉన్నత విద్య, ఉద్యోగాల సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడేవి. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా నాన్ టియరబుల్ మెటీరియల్‌ను ఉపయోగించాలని బోర్డు నిర్ణయించింది.

అంతేకాకుండా, ప్రతి మెమోపై విద్యార్థి రంగు ఫొటోను ముద్రించడం ద్వారా నకిలీ సర్టిఫికెట్ల తయారీకి అడ్డుకట్ట వేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ కొత్త విధానం వల్ల మెమోల భద్రత పెరగడంతో పాటు, వాటి ప్రామాణికతను సులభంగా నిర్ధారించుకునే అవకాశం ఉంటుంది.

ఈ నిర్ణయంతో విద్యార్థులకు దీర్ఘకాలం మన్నికైన, భద్రమైన మెమోలు అందుబాటులోకి రానుండగా, విద్యా ధ్రువపత్రాల నిర్వహణలో తెలంగాణ ఇంటర్ బోర్డు మరో సాంకేతిక ముందడుగు వేసినట్టుగా విద్యావర్గాలు అభిప్రాయపడుతున్నాయి.