BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 16 May 2026, 08:58 am
Posted by : కూనురు మధు

కరెంట్ కష్టాలు ఉండొద్దు. అధికారులకు వేముల వీరేశం కీలక ఆదేశాలు

తెలంగాణ
/ నల్గొండ / నకిరేకల్
16 May, 2026 - 08:58 AM
170 వీక్షణలు

అధికారులతో క్యాంప్ కార్యాలయంలో అత్యవసర సమీక్ష

*​రైతులకు, గృహ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం

NTODAY NEWS నకిరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అధికారులను ఆదేశించారు. నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని కేతేపల్లి, నకిరేకల్, కట్టంగూర్, నార్కట్‌పల్లి, చిట్యాల మండలాల విద్యుత్ శాఖ అధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో విద్యుత్ శాఖ డిఇ, , ఏడి , ఏఈలు పాల్గొన్నారు. ​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న విద్యుత్ స్తంభాల ఏర్పాటు, కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరు, ఓవర్‌లోడ్ సమస్యలపై అధికారుల నుంచి వివరాలు సేకరించి, తక్షణ చర్యలు తీసుకోవాలని  ఆదేశించారు . నిరంతర విద్యుత్ సరఫరా: ఎండాకాలంలో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తూ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని సమస్య పరిష్కారం చేయాలన్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ లైన్ల మరమ్మతులను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలి అని. ​తక్షణ స్పందన: ప్రజల నుండి వచ్చే విద్యుత్ ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించి, క్షేత్రస్థాయిలో సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి.అని తెలిపారు.రైతులకు, గృహ వినియోగదారులకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించాలి అని. విద్యుత్ అంతరాయం కారణంగా ప్రజలకు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు.అని హెచ్చరించారు.​ఈ సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.