BREAKING
మిల్లింగ్ ప్రక్రియలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి--జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి జర్నలిజం విలువలు కాపాడాలి… సమాజాన్ని మార్చే శక్తిగా మీడియా నిలవాలి ప్రజలకు తాగు నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలి --జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు తోటపల్లిలో 11/33 కెవి విద్యుత్ సబ్‌స్టేషన్‌కు నేడు శంకుస్థాపన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలోభాగంగా జిల్లాలో యువజన వారోత్సవాలు--యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మార్నేపల్లి ఘటనలో కిడ్నాప్ కోణం లేదన్న సీఐ రామారావు ​జాతీయ డెంగ్యూ దినోత్సవం: కలెక్టరేట్‌లో పోస్టర్ల ఆవిష్కరణ ఆహార భద్రతా ఉల్లంఘనలపై కఠిన చర్యలు.. రూ.6.5 లక్షల జరిమానా విధించిన జేసీ విద్యాధరి రుతుపవనాల రాకపై కీలక ప్రకటన చేసిన ఐఎండీ... చౌటుప్పల్ మున్సిపాలిటీలో తాగునీటి సరఫరాపై అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం మిల్లింగ్ ప్రక్రియలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి--జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి జర్నలిజం విలువలు కాపాడాలి… సమాజాన్ని మార్చే శక్తిగా మీడియా నిలవాలి ప్రజలకు తాగు నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలి --జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు తోటపల్లిలో 11/33 కెవి విద్యుత్ సబ్‌స్టేషన్‌కు నేడు శంకుస్థాపన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలోభాగంగా జిల్లాలో యువజన వారోత్సవాలు--యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మార్నేపల్లి ఘటనలో కిడ్నాప్ కోణం లేదన్న సీఐ రామారావు ​జాతీయ డెంగ్యూ దినోత్సవం: కలెక్టరేట్‌లో పోస్టర్ల ఆవిష్కరణ ఆహార భద్రతా ఉల్లంఘనలపై కఠిన చర్యలు.. రూ.6.5 లక్షల జరిమానా విధించిన జేసీ విద్యాధరి రుతుపవనాల రాకపై కీలక ప్రకటన చేసిన ఐఎండీ... చౌటుప్పల్ మున్సిపాలిటీలో తాగునీటి సరఫరాపై అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం
www.ntodaynews.com

కుటుంబానికి రూ. 64 లక్షల బీమా చెక్కు అందజేసిన డిజి,ఆపరేషన్స్ అనిల్ కుమార్

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
15 May, 2026 - 07:00 PM
7 వీక్షణలు

క్షతగాత్రుడైన ఆక్టోపస్ కానిస్టేబుల్ కుటుంబానికి రూ. 64 లక్షల బీమా చెక్కు అందజేసిన డిజి,ఆపరేషన్స్ అనిల్ కుమార్

విధి నిర్వహణలో ప్రమాదానికి గురై కోమా  స్థితిలో చికిత్స పొందుతున్న ఆక్టోపస్ కానిస్టేబుల్ జి. రజనీకాంత్ కుటుంబానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోలీస్ శాలరీ ప్యాకేజీ కింద రూ. 64,00,000/- (అరవై నాలుగు లక్షల రూపాయలు) బీమా పరిహారం మంజూరైంది. బేగంపేటలోని ఆక్టోపస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నాడు నిర్వహించిన కార్యక్రమంలో.. డిజి ,(ఆపరేషన్స్) డాక్టర్ అనిల్ కుమార్ చేతుల మీదుగా ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును కానిస్టేబుల్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు అందజేశారు.టి.జి.ఎస్.పి 3వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్  జి. రజనీకాంత్.. జనవరి 8, 2025 నుండి ఆక్టోపస్‌లో డెప్యుటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు. గతేడాది అక్టోబర్ 2వ తేదీన ఇబ్రహీంపట్నంలోని కమాండో ట్రైనింగ్ సెంటర్‌లో ఆపరేషనల్ విధులు ముగించుకుని తిరిగి వస్తుండగా.. ఉదయం 11.55 గంటల సమయంలో మోటార్ సైకిలిస్ట్ ఢీకొనడంతో రజనీకాంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయమైంది. వెంటనే స్పందించిన సిబ్బంది ఆయన్ను ఎల్బీనగర్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించారు.న్యూరో సర్జన్ ఆధ్వర్యంలో రజనీకాంత్‌కు తలకు శస్త్రచికిత్స (స్కల్ ఫ్లాప్ సర్జరీ) జరిగింది. ప్రస్తుతం ఆయన సెమీ అన్ కాన్షియస్ స్టేట్ (పాక్షిక అపస్మారక స్థితి) లో ఉండటంతో, బంజారాహిల్స్‌లోని  రిహాబిలిటేషన్ సెంటర్‌లో ఫిజియోథెరపీ, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై అక్టోబర్ 2వ తేదీ రాత్రి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 573/2025 కింద కేసు నమోదైంది.రజనీకాంత్‌కు మొయినాబాద్ ఎస్‌బీఐ శాఖలో 'పోలీస్ శాలరీ సిల్వర్ ప్యాకేజీ' అకౌంట్ ఉంది. దీనికి ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీతో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఒప్పందం ఉంది. కానిస్టేబుల్ పరిస్థితిని గమనించిన ఆక్టోపస్ డీజీ డాక్టర్ అనిల్ కుమార్ .. వెంటనే స్పందించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు ఆక్టోపస్ ఎస్పీ (అడ్మిన్) ఎం. వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో.. బ్రావో స్వాట్ టీమ్ డీఎస్పీ పి. విజయ్ కుమార్, బేగంపేట హెడ్‌క్వార్టర్స్ ఇన్‌స్పెక్టర్ (కమ్యూనికేషన్స్) బి. శ్రీనివాసరావు నిరంతరం బ్యాంకు, ఇన్సూరెన్స్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రక్రియ పూర్తి చేశారు. దీనితో ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుండి మంజూరైన రూ. 64 లక్షల చెక్కును డీజీ డాక్టర్ అనిల్ కుమార్ చేతుల మీదుగా రజనీకాంత్ తండ్రి కొమరయ్య, తల్లి నాగమణి, సోదరుడు నరేష్, సోదరి శిరీషలకు అందజేశారు. విపత్కర పరిస్థితుల్లో పోలీస్ శాఖ, ఉన్నతాధికారులు ఇంతలా అండగా నిలవడంపై కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలుపుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఎస్‌బీఐ పోలీస్ శాలరీ ప్యాకేజీ ద్వారా లభించే బీమా సౌకర్యాలు, భద్రతపై సిబ్బంది అంతా అవగాహన కలిగి ఉండాలని, ఈ ప్యాకేజీ సిబ్బంది కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆక్టోపస్ ఎస్పీ (అడ్మిన్) ఎం. వెంకటేశ్వర్లు, అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) బి. రఘునందన్ రావు, ట్రైనింగ్ కన్సల్టెంట్ కల్నల్ భరత్ ప్రసాద్, డీఎస్పీలు, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు నరేందర్ చౌదరి, నందన్, ఆనంద్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.