BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 19 March 2026, 06:00 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కవిత కొత్త పార్టీ ‘తెలంగాణ ప్రజా జాగృతి’...

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Mar, 2026 - 06:00 AM
133 వీక్షణలు

కవిత కొత్త పార్టీ ‘తెలంగాణ ప్రజా జాగృతి’... రాజకీయాల్లో కొత్త చర్చకు దారి

హైదరాబాద్/ఢిల్లీ: తెలంగాణ రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో పార్టీ నమోదు కోసం ఈ ఏడాది జనవరి 23న కేంద్ర ఎన్నికల సంఘం కు దరఖాస్తు చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 29ఏ ప్రకారం రాజకీయ పార్టీగా గుర్తింపు కోసం దాఖలు చేసిన ఈ దరఖాస్తుపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరుతూ కవిత ఢిల్లీ హైకోర్టు ను ఆశ్రయించడం గమనార్హం. తన పిటిషన్‌ను వేగంగా పరిశీలించాలని, ఎన్నికల సంఘానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు.

ఈ కేసు ఇవాళ విచారణకు రానుండగా, కోర్టు ఏమి నిర్ణయం తీసుకుంటుందో అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కొత్త పార్టీ ఏర్పాటుతో తెలంగాణ రాజకీయాల్లో సమీకరణాలు మారే అవకాశముందన్న చర్చ జోరందుకుంది.