BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 06 April 2026, 05:31 pm
Posted by : V శ్రీనివాస్

కడెం కాలువలో పడి రైతు మృతి

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
06 Apr, 2026 - 05:31 PM
184 వీక్షణలు

లక్షెట్టిపేట: కడెం కాలువలో పడి రైతు మృతి

లక్షెట్టిపేట, ఏప్రిల్ 06: పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన ఓ రైతు ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందిన విషాద ఘటన లక్షెట్టిపేట మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై గోపతి సురేష్ తెలిపిన వివరాల ప్రకారం..

ఘటన వివరాలు:

మండలంలోని జెండా వెంకటపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని పోచంపల్లి గ్రామానికి చెందిన కోవా అన్ను (39) వృత్తిరీత్యా రైతు. ఆదివారం సాయంత్రం తన పంట పొలానికి నీరు పెట్టేందుకు కడెం కెనాల్ 38 డిస్ట్రిబ్యూటరీ వద్దకు వెళ్ళాడు. కెనాల్‌లోకి దిగుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడిపోయాడు. మృతుడికి ఈత రాకపోవడంతో ప్రవాహంలో మునిగి అక్కడికక్కడే మరణించాడు.

పోలీసుల దర్యాప్తు:

మృతుడు అన్నుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతుని అన్న కోవ జంగు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లక్షెట్టిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్ పేర్కొన్నారు. ఈ ఘటనతో పోచంపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి