BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 07 June 2026, 05:28 pm
Posted by : V శ్రీనివాస్

​లక్షెట్టిపేట సర్కిల్ ఎలక్ట్రానిక్ మీడియా కార్యాలయం ఘన ప్రారంభం

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
07 Jun, 2026 - 05:28 PM
211 వీక్షణలు

​ముగ్గురు ఎస్ఐల చేతుల మీదుగా ప్రారంభోత్సవం

​సమాజ అభివృద్ధిలో మీడియా పాత్ర కీలకం: ఎస్ఐలు

​లక్షెట్టిపేట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన లక్షెట్టిపేట సర్కిల్ ఎలక్ట్రానిక్ మీడియా కార్యాలయాన్ని లక్షెట్టిపేట ఎస్ఐ సురేష్, దండేపల్లి ఎస్ఐ రాజావర్దన్, జన్నారం ఎస్ఐ ఉదయ్ కిరణ్ సంయుక్తంగా రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయాన్ని సందర్శించిన ఎస్ఐలు మీడియా సేవలను అభినందిస్తూ, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో ఎలక్ట్రానిక్ మీడియా ఎల్లప్పుడూ కీలక పాత్ర పోషిస్తుందని కొనియాడారు. బాధ్యతాయుతమైన జర్నలిజంతో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు, పలువురు ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

​అనంతరం లక్షెట్టిపేట సర్కిల్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చింత అభినయ్ మాట్లాడుతూ, తమ సర్కిల్ పరిధిలోని ముగ్గురు ఎస్ఐలు స్వయంగా హాజరై కార్యాలయాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తమను ప్రోత్సహించిన ఎస్ఐలు సురేష్, రాజావర్దన్, ఉదయ్ కిరణ్ గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, పోలీసు శాఖ మరియు మీడియా పరస్పర సహకారంతో సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ప్రజల సమస్యలను, స్థానిక అంశాలను నిష్పక్షపాతంగా ప్రజలకు చేరవేస్తూ మీడియా బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మీడియా సెక్రటరీ సంతోష్, సభ్యులు ప్రశాంత్, తిరుపతి, ముస్తఫా, రమేష్, మనోజ్, వినీత్, శ్రీనివాస్, సోక్ రెడ్డిస్ తదితరులు పాల్గొన్నారు