BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 22 May 2026, 02:55 pm
Posted by : V శ్రీనివాస్

మాదకద్రవ్యాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
22 May, 2026 - 02:55 PM
181 వీక్షణలు

మాదకద్రవ్యాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దు: మంచిర్యాల డిసిపీ ఏ.భాస్కర్

 అడిక్షన్ సెంటర్‌లో బాధితులకు కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు

 యువత మాదకద్రవ్యాల బానిసలుగా మారితే జీవితానికి అర్థం లేకుండా పోతుందని, తల్లితండ్రులు ఎన్నో కష్టాలు ఓర్చి, చదివించి పోషిస్తుంటే వారికి సమాజంలో గౌరవం తెచ్చే విధంగా ప్రయోజకులుగా మారి మంచి పేరు తేవాలని మంచిర్యాల డిసిపీ ఏ.భాస్కర్ పిలుపునిచ్చారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అడిక్షన్ సెంటర్లో చికిత్స పొందుతున్న బాధితులకు మంచిర్యాల ఏసిపి ఆర్.ప్రకాష్ ఆధ్వర్యంలో, పట్టణ ఎస్ హెచ్ ఓ. ప్రమోద్ రావు నేతృత్వంలో శుక్రవారం ఒక ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిసిపి ఏ.భాస్కర్ చికిత్స పొందుతున్న వారితో ప్రత్యక్షంగా మాట్లాడి, భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు తిరిగి పునరావృతం కాకుండా చూసుకోవాలని, వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని దిశానిర్దేశం చేశారు.

​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులు తమ తప్పులను తెలుసుకొని సమాజ సేవలో ముందుండాలని, తల్లిదండ్రులకు గౌరవప్రదంగా ఉండేందుకు కష్టపడి పనులు చేస్తూ జీవితంలో స్థిరపడాలని ఆకాంక్షించారు. బాధితుల్లో మానసిక ధైర్యాన్ని నింపి, వారు వ్యసనాల నుంచి త్వరగా కోలుకునేలా చేసేందుకు పోలీసులు, వైద్య బృందం సంయుక్తంగా ఈ ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ అడ్మిన్ వైద్యులు శ్రీమన్నారాయణ, మానసిక వైద్య నిపుణులు రామ్ నాయక్, నర్సింగ్ ఆఫీసర్లు, ఆసుపత్రి సిబ్బంది మరియు పోలీస్ అధికారులు తదితరులు పాల్గొని బాధితులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించారు