BREAKING
వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..
www.ntodaynews.com

మే 15న 2026 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 May, 2026 - 04:28 PM
81 వీక్షణలు

మే 15న 2026 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం

కుటుంబం అంటే కేవలం భార్యాభర్తలు, పిల్లలు మాత్రమే కాదు.. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, మనవలు, మనవరాళ్లు అందరూ కలిసిన బంధాల సమాహారం. పరస్పర ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు, సహాయ సహకారాలు ఉన్న చోటే నిజమైన కుటుంబం ఉంటుంది. అలాంటి కుటుంబమే ఆదర్శ కుటుంబం.. బంగారు కుటుంబం.

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మన సంస్కృతికి ప్రతీకగా నిలిచేది. ఇంట్లో పెద్దలు ఉండేవారు.. చిన్నవాళ్లకు మార్గదర్శకత్వం చేసేవారు. బంధువులు వస్తే ఇంటంతా సందడిగా మారేది. మేనమామలు, మేనత్తలు, బాబాయిలు, అత్తలు.. ఇలా ప్రతి బంధానికి ప్రత్యేకమైన ఆప్యాయత ఉండేది. “కలసి ఉంటే కలదు సుఖం” అనే మాట జీవన విధానంగా ఉండేది.

కానీ గత మూడు దశాబ్దాలుగా పారిశ్రామికరణ, ఉపాధి అవకాశాలు, టెక్నాలజీ విస్తరణ, జీవనశైలిలో మార్పులు, స్వార్థపూరిత ఆలోచనలు, సంపాదనే ప్రధాన లక్ష్యంగా మారడం వంటి కారణాలతో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ క్రమంగా బలహీనపడింది. అటాచ్మెంట్ స్థానంలో డిటాచ్మెంట్ పెరిగింది. పిల్లలకు తమ బంధువులే తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి.

చదువులు, ఉద్యోగాలు, కెరీర్ పేరుతో యువత దూర ప్రాంతాలు, విదేశాలకు వెళ్లి స్థిరపడుతున్నారు. తమ కోసం జీవితాన్ని అంకితం చేసిన తల్లిదండ్రులకు దూరమవుతున్నారు. ఫలితంగా కుటుంబ బంధాలు క్రమంగా కుంచించుకుపోతున్నాయి. ఒకప్పుడు బంధువులు వెళ్తుంటే బాధపడేవాళ్లం.. ఇప్పుడు కలిసి ఉండటానికే సమయం దొరకని పరిస్థితి వచ్చింది.

ఈ నేపథ్యంలో కుటుంబ వ్యవస్థ ప్రాముఖ్యతను గుర్తించిన United Nations 1994లో ప్రతి సంవత్సరం మే 15ను “అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం”గా నిర్వహించాలని నిర్ణయించింది. కుటుంబ విలువలు, బంధుత్వాల ప్రాధాన్యం, పరస్పర బాధ్యతలపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

కుటుంబం ఐక్యంగా ఉంటే ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వస్తుంది. అందరూ ఒకేచోట ఉండకపోయినా అవసర సమయంలో ఒకరికొకరు అండగా నిలబడటం నిజమైన కుటుంబ బలం.

ఆ రోజులు… ఆ అనుబంధాలు… ఆ బంధుత్వాల మాధుర్యం… ఇవన్నీ నేటికీ మరపురాని జ్ఞాపకాలే. కుటుంబ బంధాలను కాపాడుకోవడం, పెద్దలను గౌరవించడం, బంధాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత.