BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

మే డేను బహిష్కరిద్దాం, విశ్వకర్మ జయంతిని కార్మిక దినోత్సవం గా జరుపుకుందాం

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి
Reporter
రాఘవేంద్ర కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రతినిధి
30 Apr, 2026 - 07:18 PM
22 వీక్షణలు

మే డేను బహిష్కరిద్దాం, విశ్వకర్మ జయంతిని కార్మిక దినోత్సవం గా జరుపుకుందాం: బిఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ 

పాశ్చాత్య సంస్కృతి నుండి వచ్చిన మే 1 'మే డే' వేడుకలను బహిష్కరించలని BMS పిలుపునిచ్చింది. భారతీయ శ్రమ సంస్కృతికి ప్రతిరూపమైన విశ్వకర్మ జయంతిని అధికారికంగా "జాతీయ కార్మిక దినోత్సవం"గా జరుపుకోవాలని BMS డిమాండ్ చేసింది. శ్రమను దైవంగా భావించినది భారతదేశం మాత్రమే అన్నారు.సకల సృష్టికి, నిర్మాణానికి మరియు సాంకేతికతకు మూలపురుషుడు విశ్వకర్మ భగవానుడు అని కొనియాడారు.వేల ఏళ్ల క్రితమే అద్భుతమైన కట్టడాలను, యంత్రాలను, ఆయుధాలను అందించిన మన దేశపు శిల్పుల, వృత్తి పనివారి నైపుణ్యాన్ని స్మరించుకోవడమే నిజమైన శ్రామిక గౌరవం అన్నారు.

BMS ముఖ్య ఉద్దేశ్యాలు:

స్వదేశీ సంస్కృతి: విదేశీ పోరాటాల గుర్తుగా జరుపుకునే మే డే కంటే, మన సొంత గడ్డపై పుట్టిన విశ్వకర్మ ఆరాధనకే ప్రాధాన్యత ఇవ్వాలి.

నైపుణ్యానికి గుర్తింపు: విశ్వకర్మ ఐదుగురు సంతానం (మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ) ప్రాతినిధ్యం వహించే పంచవృత్తులే నేటి ఆధునిక పారిశ్రామిక రంగానికి పునాది.అన్నారు 

ప్రభుత్వానికి విన్నపం: కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వకర్మ జయంతిని అధికారికంగా 'జాతీయ కార్మిక దినోత్సవం'గా ప్రకటించి, ఆ రోజున శ్రామికులకు తగిన గుర్తింపును, ప్రోత్సాహకాలను అందించాలన్నారు.

"పనియే దైవం" అని నమ్మే ప్రతి కార్మికుడు, శ్రామికుడు ఈ పిలుపును అందుకుని మన సనాతన ధర్మం మరియు శ్రమ సంస్కృతిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. శ్రమశక్తికి దైవత్వం: పాశ్చాత్య దేశాలలో కార్మిక దినోత్సవం కేవలం హక్కుల పోరాటం నుండి పుట్టింది. కానీ భారతదేశంలో పనిని దైవంగా భావిస్తాం. సృష్టికి ఆది ఇంజనీర్, శిల్పి అయిన విశ్వకర్మ భగవానుడిని ఆరాధించడం అంటే శ్రమను గౌరవించడమే అన్నారు 

మే డే - ఒక విదేశీ దిగుమతి: చికాగోలో జరిగిన సంఘటనల ఆధారంగా పుట్టిన మే డే మన దేశ పరిస్థితులకు, మట్టి వాసనకు ఏమాత్రం పొంతన లేనిది. విదేశీ భావజాల బంధనాల నుండి కార్మిక లోకం విముక్తి పొందాల్సిన సమయం ఆసన్నమైందన్నారు 

ఐదు వృత్తుల ఐక్యత: విశ్వకర్మ ఐదుగురు సంతానం ప్రాతినిధ్యం వహించే లోహ, దారు, తామ్ర, శిలా, స్వర్ణ వృత్తులే నేటి పారిశ్రామిక రంగానికి పట్టుకొమ్మలు. ఈ ఐదు వృత్తుల వారిని కలిపి జాతీయ కార్మిక దినోత్సవంగా జరుపుకోవడం ద్వారానే శ్రామికులందరికీ సమన్యాయం జరుగుతుందన్నారు.

కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే 'విశ్వకర్మ జయంతి'ని జాతీయ కార్మిక దినోత్సవంగా గెజిట్‌లో చేర్చాలని, లేనిపక్షంలో బి.ఎం.ఎస్. ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలంగాణ రాష్ట్ర కన్స్ట్రక్షన్ మజ్దూర్ సంఘ్ ప్రధాన కార్యదర్శి పి. మోహన్ రెడ్డి తెలిపారు. 

"మనం భారతీయ కార్మికులం.. మనకు భారతీయ పండుగలే ముఖ్యం" అని నినదిస్తూ, ప్రతి శ్రామికుడు తన వృత్తిని, తన మూలాలను గౌరవించుకోవాలని టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ పిలుపునిచ్చారు