BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 30 April 2026, 10:33 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మే లో బ్యాంకులకు బ్రేక్.. వరుసగా 9 రోజులు సెలవులు – కస్టమర్లకు ముందస్తు ప్లాన్ తప్పనిసరి

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 10:33 PM
132 వీక్షణలు

మే లో బ్యాంకులకు బ్రేక్.. వరుసగా 9 రోజులు సెలవులు – కస్టమర్లకు ముందస్తు ప్లాన్ తప్పనిసరి

మే నెలలో బ్యాంకు సేవలు కొంతకాలం అంతరాయం కలిగించనున్నాయి. మొత్తం 9 రోజులు బ్యాంకులు మూతపడనున్న నేపథ్యంలో ఖాతాదారులు ముందుగానే తమ లావాదేవీలను ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నెల ప్రారంభంలోనే మేడే కారణంగా మే 1న బ్యాంకులు పనిచేయవు. అనంతరం వరుసగా వచ్చే ఆదివారాలు, రెండో మరియు నాలుగో శనివారాలు బ్యాంకులకు సాధారణ సెలవులే. ఇదే సమయంలో మే 27న బక్రీద్ పండుగ సందర్భంగా మరోసారి బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ నెలలో మొత్తం 5 ఆదివారాలు రావడం పరిస్థితిని మరింత ప్రభావితం చేసింది. మే 1, 3, 9, 10, 17, 23, 24, 27, 31 తేదీల్లో బ్యాంకులు పూర్తిగా మూతపడనున్నాయి. నగదు లావాదేవీలు, చెక్కు క్లియరెన్స్, ఇతర బ్యాంకింగ్ పనులు ఆలస్యం కావొచ్చని బ్యాంకు వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారులు, జీతభత్యాలు పొందే ఉద్యోగులు, అత్యవసర నగదు అవసరాలున్నవారు ముందుగానే ఏర్పాట్లు చేసుకోవడం అవసరం. అయితే డిజిటల్ బ్యాంకింగ్ సేవలు సాధారణంగా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా మే నెలలో బ్యాంకుల సెలవుల క్యాలెండర్ కస్టమర్లకు ఒక చిన్న హెచ్చరికలా మారింది.