BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

మైలవరం పాఠశాలలో మంత్రి లోకేష్ ఆకస్మిక తనిఖీ

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Mar, 2026 - 03:41 PM
142 వీక్షణలు

మధ్యాహ్న భోజనం రుచి చూసి పరిశీలన – నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరిక

మైలవరం, మార్చి 17: ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం దేవునిచెరువు తారకరామా నగర్ ఎంపీపీ ప్రాథమిక పాఠశాలను విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల మధ్యాహ్న భోజనం నాణ్యతపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ తనిఖీ చేపట్టారు.

పాఠశాలలో విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనాన్ని స్వయంగా రుచి చూసి నాణ్యతను పరిశీలించిన మంత్రి, విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం భోజనం బాగుందని విద్యార్థులు తెలిపారు. గతంలో జరిగిన ఘటనపై కూడా మంత్రి ఆరా తీశారు.

భోజనం సరిగా లేకపోతే వెంటనే తల్లిదండ్రులకు తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు. ‘లీప్ యాప్’ ద్వారా తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించనున్నట్లు తెలిపారు.

కఠిన చర్యలు తప్పవు:

సిబ్బందితో మాట్లాడుతూ చిన్న నిర్లక్ష్యానికైనా కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ప్రతిరోజూ ఒక ఉపాధ్యాయుడు భోజనం నాణ్యతను తనిఖీ చేయాలని ఆదేశించారు.

విద్యా ప్రమాణాలపై దృష్టి:

పాఠశాలలో బోధన విధానం, పరిశుభ్రత, రికార్డులను పరిశీలించిన మంత్రి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపుపై దృష్టి పెట్టాలని సూచించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఎలాంటి రాజీ ఉండదని మంత్రి స్పష్టం చేశారు.