BREAKING
శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..!
Date of Publish : 25 April 2026, 08:44 am
Posted by : ఇప్పలపల్లి నరేందర్

మద్యం విషయంలో గొడవ, యువకుడి హత్య

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
25 Apr, 2026 - 08:44 AM
879 వీక్షణలు

మద్యం విషయంలో గొడవ, యువకుడి హత్య

మద్యం విషయంలో స్నేహితుల మధ్య గొడవ జరిగి తోటి స్నేహితుని ఇనుపరాడుతో కొట్టి చంపిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, మేడిపల్లి గ్రామంలో  ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బొమ్మలరామారం ఎస్ఐ బుగ్గ శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం మేడిపల్లి గ్రామానికి చెందిన స్నేహితులు రాగిర్ మధు, గాంధారి చరణ్, ఊట్ల నవీన్ గ్రామ శివారులోని హరితహారం వెంచర్ లో ఈనెల 21వ తేదీన మంగళవారం రాత్రి నుండి ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల వరకు మద్యం సేవించారు మద్యం లాస్ట్ లక్కీ డ్రాప్ విషయంలో స్నేహితుల మధ్య గొడవ జరిగి మధు ఇద్దరు స్నేహితులపై దాడి చేశాడు దీంతో మిగతా ఇద్దరూ కోపంతో మధును ఇనుపరాడుతో కొట్టి హత్య చేశారు మృతదేహాన్ని వెంచర్ పక్కనే ఉన్న షామీర్పేట్ వాగు పొదల్లో పడేశారు మూడు రోజుల తర్వాత భయంతో చరణ్ తన తల్లికి ఈ విషయాన్ని చెప్పాడు వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి నిందితుడు లొంగిపోయాడు మరొక నిందితుడు పరారీలో ఉన్నాడు  ఎస్ఐ శ్రీశైలం, సిఐ చంద్రబాబు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని గుర్తించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు కుమారుడు హత్యకు గురయ్యాడని తెలియడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నిరు అవుతున్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా హాస్పిటల్ కు తరలించామని ఎస్.ఐ బుగ్గ శ్రీశైలం తెలిపారు