BREAKING
శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..!
Date of Publish : 24 July 2026, 01:35 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో నీట్ పేపర్ లీకేజీ ఘటనపై న్యాయవాదుల నిరసన.. కోర్టు విధుల బహిష్కరణ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Jul, 2026 - 01:35 PM
70 వీక్షణలు

తిరువూరు, జూలై 24: జిల్లా బార్ ఫెడరేషన్ పిలుపు మేరకు, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రకటించిన నిరసన కార్యక్రమానికి మద్దతుగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో శుక్రవారం న్యాయవాదులు ఆందోళన చేపట్టారు.

నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనతో పాటు విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరును ఖండిస్తూ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో తిరువూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం కోర్టు విధులను బహిష్కరించి తమ నిరసనను వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సంకురాత్రి జనార్దన్ రావు మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన వారిపై బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గోగిరెడ్డి కృష్ణారెడ్డి, సీనియర్ న్యాయవాదులు రేగళ్ల మోహన్ రెడ్డి, చింతల వెంకటరెడ్డి, మర్సకట్ల కుమార్, వాకధాని లక్ష్మీనారాయణ, అత్తునూరి శ్రీనివాసరావు, మాకరాజు రామ్మోహన్ రాజు, మేకల నాగేంద్రప్రసాద్, అంకిరెడ్డి అంజన రెడ్డి, నాగుబండి రామకృష్ణ, పల్లెపాటి శ్రీనివాసరావు, కొత్తపల్లి ఆనంద స్వరూప్, కోట జమలయ్య, చింతా బత్తిన రాజేంద్ర బాబు, షేక్ గౌస్, ఎస్.కే. సుభాని, నల్లపాటి సుబ్బారాయుడు, రావూరి నాగరాజు, కనపర్తి రాంబాబు, చిరుమామిళ్ల వెంకటేశ్వరరావు, చిలక హేమంత్, కారుమంచి సునీల్, భుఖ్య రామారావు, మన్నే వెంకటేశ్వరరావు, బండ్రపల్లి నవీన్‌తో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.