BREAKING
శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..!
Date of Publish : 24 July 2026, 01:59 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో ఎస్ఎఫ్ఐ బంద్.. విద్యాసంస్థలు మూత, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Jul, 2026 - 01:59 PM
51 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ పిలుపు మేరకు శుక్రవారం విద్యాసంస్థల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు పలు ప్రభుత్వ విద్యాసంస్థలను మూసివేయించి నిరసన తెలిపారు.

ఇటీవల జరిగిన ఘటనల్లో 22 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించలేదని వారు విమర్శించారు. అమాయక విద్యార్థులపై పోలీసులు అత్యంత దారుణంగా వ్యవహరించి లాఠీచార్జీకి పాల్పడ్డారని ఆరోపించారు.

ఈ ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్ర వీడి వెంటనే స్పందించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు.