BREAKING
కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
Date of Publish : 24 July 2026, 03:54 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మెగా పేరెంట్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Jul, 2026 - 03:54 PM
32 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని ప్రగడవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ డే (మెగా పీటీఎం–4.0) కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఎమ్మెల్యే ముఖాముఖిగా సమావేశమై విద్యార్థుల విద్యా పురోగతి, హాజరు, క్రమశిక్షణ, అభ్యాస నైపుణ్యాలపై చర్చించారు. ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి తీసుకొస్తున్న సంస్కరణలు విజయవంతం కావాలంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.

పాఠశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థుల ప్రతిభా ప్రదర్శనలు, అభ్యాస కార్యక్రమాలను ఎమ్మెల్యే పరిశీలించి విద్యార్థులను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలను నాణ్యమైన విద్యకు కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.