BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 11 July 2026, 05:41 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మెట్టగుట్ట దేవస్థానానికి రూ.25,116 విరాళం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Jul, 2026 - 05:41 PM
328 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, గంపలగూడెం: గంపలగూడెం మండలం పెనుగొలను సమీపంలోని మెట్టగుట్టలో వెలసిన శ్రీ గజలక్ష్మి సమేత శేషాచల శ్రీనివాసస్వామి దేవస్థానానికి తునికిపాడు గ్రామానికి చెందిన కర్నాటి కృష్ణారావు, స్వరూపారాణి దంపతులు శనివారం రూ.25,116 విరాళాన్ని అందజేశారు.

దాతల నుంచి ఆలయ కమిటీ చైర్మన్ పంది వెంకట్రావు విరాళాన్ని స్వీకరించారు. అనంతరం దాత దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు శ్యామ్ కె. సుందర శ్రీనివాసాచార్యులు వేదమంత్రాలతో ఆశీర్వదించి, శేషవస్త్రంతో సత్కరించారు.

శనివారం పర్వదినం సందర్భంగా వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

దేవస్థానంలో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, ఆలయ అభివృద్ధికి భక్తులు తమ వంతు విరాళాలు అందించి సహకరించాలని ఆలయ కమిటీ చైర్మన్ పంది వెంకట్రావు విజ్ఞప్తి చేశారు.