BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 19 March 2026, 10:03 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మహారాష్ట్రలో సంచలనం… గాడ్‌మ్యాన్ అరెస్ట్

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Mar, 2026 - 10:03 PM
199 వీక్షణలు

మహారాష్ట్రలో సంచలనం… గాడ్‌మ్యాన్ అరెస్ట్

మహారాష్ట్రలో ఓ స్వయంఘోషిత గాడ్‌మ్యాన్ అరెస్ట్ కావడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. జ్యోతిష్యుడు, న్యూమరాలజిస్ట్‌గా పేరుగాంచిన అశోక్ కారత్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాసిక్‌కు చెందిన ఈ వ్యక్తికి రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.

పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2022 నవంబర్ నుంచి 2025 డిసెంబర్ వరకు 35 ఏళ్ల మహిళపై పలు మార్లు లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలికి మత్తుమందు ఇచ్చి దాడులకు పాల్పడి, వాటిని వీడియోగా చిత్రీకరించి బ్లాక్‌మెయిల్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ కేసులో భాగంగా 58 అసభ్య వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అశోక్ కారత్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 64 కింద అత్యాచారం కేసుతో పాటు ఇతర తీవ్ర నేరాల కింద కేసులు నమోదు చేశారు.

ఈ ఘటనపై రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితుడి సంబంధాలు, ఇతర బాధితుల అంశంపై కూడా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.