BREAKING
thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
Date of Publish : 30 June 2026, 08:02 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మహేష్ బాబు AMB సినిమాస్‌తో పాటు మరో ఐదు థియేటర్లకు భారీ జరిమానా

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jun, 2026 - 08:02 PM
113 వీక్షణలు

సినిమా టికెట్లపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించినప్పటికీ, టికెట్ల గ్రాస్ రేట్లను పెంచి ప్రేక్షకుల నుంచి అదనపు మొత్తాన్ని వసూలు చేశారన్న ఆరోపణలపై హీరో మహేష్ బాబుకు చెందిన AMB సినిమాస్‌తో పాటు మరో ఐదు థియేటర్లపై జీఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ (GSTAT) జరిమానాలు విధించింది.

ఈ కేసులో AMB సినిమాస్‌కు మొత్తం రూ.1.7 కోట్ల బకాయిలు ఉన్నట్లు ట్రిబ్యునల్ పేర్కొంది. ఇందులో తొలి విడతగా రూ.35 లక్షలను వెంటనే జమ చేయాలని ఆదేశించింది. అలాగే మిగిలిన మొత్తాన్ని నిబంధనల ప్రకారం చెల్లించాలని సూచించింది.

ఇతర థియేటర్లకు విధించిన జరిమానాలు ఇలా ఉన్నాయి..

జ్యోతి థియేటర్ – రూ.19.8 లక్షలు

భ్రమరాంబ సినిమాస్ – రూ.11.8 లక్షలు

కుమార్ 70MM – రూ.2.5 లక్షలు

ASR సినిమాస్ – రూ.9.6 లక్షలు

విశ్వనాథ్ 70MM – రూ.9 లక్షలు

ఈ మొత్తాలకు అదనంగా 18 శాతం వడ్డీని కలిపి సంబంధిత సంక్షేమ నిధికి చెల్లించాలని GSTAT ఆదేశాలు జారీ చేసింది.

జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు అందించకుండా, టికెట్ ధరలను పెంచి అదనపు వసూళ్లకు పాల్పడిన థియేటర్లపై ఈ చర్యలు తీసుకున్నట్లు ట్రిబ్యునల్ స్పష్టం చేసింది.